Diwali Bash: బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ గ్లామర్ షో.. దివాళి బాష్ వేడుకల్లో..

Diwali Bash: బాలీవుడ్‌ ఇండస్ట్రీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లు గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్, అనన్య పాండే, సారా అలీఖాన్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేశారు. టాలీవుడ్ భామలు కూడా బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ అందాలు ఆరబొయ్యడంలో సీనియర్ హీరోయిన్లకు మించిపోతున్నారు.

మరో రెండు రోజుల్లో దీపావళి వేడుకలు ప్రారంభమవుతాయి. బాలీవుడ్‌లో దీపావళి పండుగ సందర్భంగా ‘దివాళి బాష్’ అంటూ సెలబ్రిటీలు పార్టీలు చేసుకుంటారు. ప్రముఖ నిర్మాతలు ఏక్తాకపూర్ దగ్గరనుంచి కరణ్ జోహార్, అలాగే స్టార్ హీరో హీరోయిన్లు, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా దివాళి బాష్ పార్టీ చేసుకుంటారు. ఈ పార్టీలకి సెలబ్రిటీలు అందంగా రెడీ అయి వస్తుంటారు. నిన్న రాత్రి జరిగిన వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీ గ్లామరస్‌గా రెడీ అయి వచ్చారు. ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన దివాళి సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి.

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన శారీతో జాన్వీ కపూర్ టు మచ్ గ్లామరస్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్‌ కూడా ఎంతో అందంగా కనిపించింది. అలాగే లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా పార్టీకి హాజరైంది. శారీ ధరించుకుని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పార్టీకి వచ్చింది. అలాగే సైఫ్ అలీఖాన్ కూతురు, సక్సెస్ ఫుల్ బ్యూటీ సారా అలీ ఖాన్ కూడా డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్ ధరించుకుంది. కివెజ్ షో చేస్తూ హోయలు పూయించింది.

అలాగే రకుల్ ప్రీత్‌సింగ్, కియారా అద్వానీ, తాప్సి తదితర స్టార్ హీరోయిన్లు పార్టీకి హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ అందాలపై కామెంట్లు చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్లామర్ విషయంలో ఈ కుర్ర హీరోయిన్లు హద్దులు దాటేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

1

2

3

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -