Varun-Lavanya: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్డు ఖరీదెంతో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే!

Varun-Lavanya: సినీ నటుడు వరుణ్ తేజ్ మరొక రెండు రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నవంబర్ 1వ తేదీ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఇక వీరి వివాహం ఇటలీలో జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు అప్పటినుంచి వీరిద్దరూ రహస్యంగా తమ ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు అయితే జూన్ 9వ తేదీ వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అనే విషయాన్ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఈ విధంగా వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక వీరి వివాహం నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో జరగగా నవంబర్ 5వ తేదీ హైదరాబాదులో టాలీవుడ్ సెలబ్రిటీ అందరికీ ఘనంగా పార్టీ ఇవ్వబోతున్నారు. వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా పలువురు సెలబ్రిటీలకు అందజేశారు. ప్రస్తుతం ఈ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇన్విటేషన్ కార్డ్ ఖరీదు గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఒక్క పెళ్లి పత్రిక కోసం ఖర్చు చేసిన డబ్బుతో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తన కుమార్తె పెళ్లిని చేయవచ్చు అంత ఖరీదు చేసే పెళ్లి పత్రికలను అచ్చు వేయించి సెలబ్రిటీలను ఇన్వైట్ చేశారని తెలుస్తోంది. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం తయారు చేయించిన ఒక్క వెడ్డింగ్ కార్డు విలువ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఉంటుందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ స్పెషల్ గా డిజైన్ చేయించడంతో ఇంత ఖరీదు పలుకుతోందని చెప్పాలి అయితే ఒక వెడ్డింగ్ కార్డు కోసం ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేశారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -