Varun Tej: మాజీ ప్రేయసి కి పెళ్లి ఆహ్వాన పత్రిక అందచేసిన వరుణ్ తేజ్.. దెబ్బకు ఆమె నోరు మూయించాడంటూ?

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం వచ్చే నెల ఒకటవ తారీఖున జరగనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీలో జరగనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వరుణ్, లావణ్యల జంట డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో దేశం కానీ దేశంలో పెళ్లి చేసుకోవడానికి కారణం వరుణ్ తేజ్ కి ప్రైవేట్ గా పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టి. హైదరాబాద్ లో చేసుకుంటే మీడియా రచ్చ వేరేలా ఉంటుంది. కాగా ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబం సభ్యులతో పాటు, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరు కాబోతున్నారు.

అలాగే ఇండస్ట్రీ నుండి కూడా కొంతమందిని వరుణ్ తేజ్ ప్రత్యేకించి ఆహ్వానించాడట. ఆయనకీ మెగా ఫ్యామిలీ కాకుండా, బయట వాళ్ళతో పెద్దగా స్నేహం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్స్ లో మాత్రం ఆయనకీ మంచి సాన్నిహిత్యం ఉండేదిలావణ్య త్రిపాఠితో ప్రేమ విషయం బయటపడక ముందు వరుణ్ తేజ్, రాశీ ఖన్నా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపించేవి. వీళ్లిద్దరు కలిసి గతంలో తొలిప్రేమ అనే చిత్రం చేసారు.

ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వరుణ్ తేజ్ రాశీ ఖన్నా లవ్ లో పడ్డారని, ఇద్దరు కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసుకున్న తర్వాత పెళ్ళికి సెట్ అవ్వము అనే నిర్ణయానికి వచ్చి చాలా కూల్ గా బ్రేకప్ చేసుకున్నారని అప్పట్లో టాక్. కానీ బ్రేకప్ అయ్యినప్పటికీ కూడా ఇద్దరు ఎంతో స్నేహం గా ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గానే రాశీ ఖన్నా ఇంటికి వెళ్లి పెళ్ళికి కచ్చితంగా రావాలి అంటూ ఆహ్వాన పత్రిక అందచేసాడట వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -