Lavanya Tripathi: ఆ హీరోతో ఎఫైర్ వార్తలే లావణ్య కెరీర్ ను ముంచేశాయా?

Lavanya Tripathi: తెలుగులో హీరోయిన్లకు మంచి గుర్తింపు ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఒక్క హీరోయిన్ నచ్చిందంటే ఏళ్లకు ఏళ్లు ఆమెను తెర మీద చూడటానికి ఇష్టపడుతుంటారు. ఇలా ఎంతో మంది హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను అలరించారు, అలరిస్తూనే ఉన్నారు. ఈ కోవలో ఓ హీరోయిన్ తిరిగి ఫామ్ లోకి వచ్చింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో జోరు చూపిస్తోంది.

 

 

‘అందాల రాక్షసి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డంని సొంతం చేసుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. వరుసగా భారీ సినిమాలను దక్కించుకుంది. దీంతో అమ్మడు ఇంక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే టాక్ నడిచింది. కానీ ఉన్నట్టుండి లావణ్య త్రిపాఠికి అవకాశాలు తగ్గాయి. దీనికి కారణం లావణ్య, ఓ హీరోతో లవ్ లో ఉందని, త్వరలో వీరిద్దరికి పెళ్లి కూడా అవబోతుందనే వార్తలు వచ్చాయి.

 

 

దీంతో లావణ్య త్రిపాఠికి అవకాశాలు తగ్గిపోయాయి. వరుస సినిమాలు చేయాల్సిన లావణ్య త్రిపాఠికి అవకాశాలు నెమ్మదిగా తగ్గి.. ఓ స్థాయిలో సినిమాలు లేకుండా ఉండింది. దాంతో లావణ్య త్రిపాఠికి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదని, ఆమె ఫేడవుట్ అయిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం లావణ్య.. కోన వెంకట్ దర్శకత్వంలో ‘మేక పులి’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.

 

మరోపక్క హీరోయిన్ లావణ్య త్రిపాఠి… తెలుగులో మంజునాథ్ డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా, తమిళంలోనూ మరో సినిమా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. రాబోయే రోజుల్లో లావణ్య త్రిపాఠి ఇలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లో ఆమె తిరిగి పూర్తిస్థాయిలో ఫాంలోకి వస్తుందని, తిరిగి భారీ ప్రాజెక్టులు అందుకుంటుందనే టాక్ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -