Varun Tej: వరుణ్ తేజ్ గురించి నెటిజన్స్ సెటైర్లు.. ఏం జరిగిందంటే?

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన నటించిన ఆపరేషన్ వాలెంటైన్స్ సినిమా మార్చి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

 

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగల్ విడుదల చేశారు. ఈ పాటను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విడుదల చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన స్టూడెంట్స్ తో కలిసి ముచ్చటించి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దీంతో ఈయన గురించి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఒకానొక సమయంలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వరుణ్ ఎంతో మొహమాట పడేవారు. ప్రస్తుతం మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ అన్ని విషయాలను తెలియజేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే వరుణ్ అన్ని విషయాల గురించి ఇలా ఓపెన్ కావడంతో అభిమానులు వరుణ్ పట్ల వివిధ రకాలు కామెంట్ చేస్తున్నారు .అన్న మీరు ఇదివరకు ఇలా లేరు పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయారు. ఈ మార్పుకు లావణ్య త్రిపాఠి కారణమే కదా అంటూ ఈయన పై నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీపై వరుణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -