Bonda Uma: వైసీపీ ‘పుష్ప’ల వల్లే అలిపిరిలో చిరుతలు.. బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు!

Bonda Uma: తాజాగా అలిపిరిలో ఆరేళ్ల చిన్నారి పై చిరుత పులి దాడి చేసిన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీని గురించి స్పందిస్తూ నూతన టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కాలి నడకన వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊత కర్రని ఇస్తాము అని చెప్పటంతో ఆ స్టేట్మెంట్ తెగ వైరల్ అయింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి ట్రోల్స్ కి గురి అయ్యారు. ఇదే విషయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండ ఉమా తన ప్రతిస్పందన తెలియజేశారు.

వైసీపీ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడకమార్గంలోకి వచ్చేస్తున్నాయని.. వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారని వారు ఎర్రచందనం స్మగ్లింగ్ యదేచ్చగా చేస్తున్నారని అందువల్లే చిరుతపులులు మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయని ఆయన తెలిపారు. చిరుతపులులని తరమటం కోసం చేతి కర్రలు ఇస్తామంటున్న వాళ్లని భక్తులు అదే కర్రలతో బడిత పూజ చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు.

 

వాళ్ల సమర్ధతని కపిపుచ్చుకోవటానికి పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారంటూ బోండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి విజన్ అంటేనే అర్థం తెలియదని అబద్ధాలు చెప్పే వైసీపీ అధికారంలోకి వచ్చింది. మేము విజన్ డాక్యుమెంట్ చూపిస్తే వైసీపీ వాళ్ళు ప్రిజన్ డాక్యుమెంట్ చూపించారు. అభివృద్ధి ఎలా చేయాలో టీడీపీ విజన్ డాక్యుమెంట్ అయితే ఎంతమందిని జైల్లోకి పంపాలనేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ అన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అంటున్న వైసీపీ ఈ నాలుగున్నరేళ్ళు ఏం పీకారు..

 

నిజంగా చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే అది వైసీపీ ఎందుకు నిరూపించలేకపోయింది అంటూ ప్రశ్నించారు బోండా ఉమా. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని సొల్లు పురాణం ఎన్నాళ్లు చెప్తారు. వాళ్లు ఎన్ని ఎంక్వయిరీలు చేసుకున్నా చంద్రబాబు కాలిగోటిని కూడా టచ్ చేయలేకపోయారు. ఏపీలో ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో పది లక్షల కోట్ల మీద దోచుకున్న వైసీపీ చంద్రబాబుని విమర్శిస్తుందా అంటూ బోండా ఉమా ఎద్దేవా చేశారు.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -