Jagan Sister: జగన్ చెల్లెలు కామెంట్లతో వాళ్ల నోరు మూయించిందిగా.. ఏమైందంటే?

Jagan Sister: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే మారుతూ ఉంటాయి. తరచూ ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు అధికార ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండగా అధికార ప్రభుత్వ నేతలు తమ స్థాయిలో ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తాజాగా ప్రతిపక్ష నాయకులకు చుక్కలు చూపించారు.

మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతిపక్ష నాయకులపై సెటైర్లు వేస్తూ మాట్లాడటంతో వైసిపి నాయకులలో ఎంతో జోష్ కనిపించింది. ఈ సందర్భంగా అమ్మబడి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కురుపాం నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పుష్పశ్రీవానీ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల పై తనదైన స్టైల్ లో కౌంటర్లు వేయడమే కాకుండా వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.

 

ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ విపక్షాలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఆయన నీడను కూడా ఎవరు టచ్ చేయలేరని పుష్పశ్రీవాన్ని తెలిపారు.ఆరు కోట్ల మంది ఆంధ్రుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీడను టచ్ చేయాలన్న విపక్షాలకు సవాల్ అంటూ ఈమె మాట్లాడారు.ఇక చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జగన్ పథకాలను కాపీ కొట్టవచ్చు కానీ ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్, ప్రతి ఒక్క పథకాన్ని సరైన సమయంలో అమలుపరిచే ధైర్యం చంద్రబాబు కాపీ కొట్టలేరని తెలిపారు.

 

అటు యువగళం ఇటు నారాహి యాత్ర ఏదైనా కూడా జగన్ ప్రజా బలం ముందు బలాదూర్ అంటూ పుష్ప శ్రీవాణి చేసిన స్పీచ్ ఇపుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇలా ఈ బహిరంగ సభలో పుష్పశ్రీవాణి జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడటమే కాకుండా ప్రతిపక్ష నేతలకు తన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ప్రతిపక్ష నేతల నోళ్ళను మూయించిందని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -