YS Jagan: ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ లు.. ఓటమి భయంతో జగన్ కుటిల ప్రయత్నాలకు తెర తీస్తున్నారా?

YS Jagan: తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన అంశం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అధికారులు జైలు పాలు అయ్యారు. అయితే, ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తోంది. ఏపీ ఏకంగా ఇంటిలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులనే గురిపెట్టింది. ఇంటెలిజెన్సీ ఐజీ నేతృత్వంలో చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు.

చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో వర్క్ షాప్‌ నిర్వహించారు. ఆ వర్క్ షాప్‌ల్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిందని బోండా ఉమా ఉన్నారు. ఓ కొత్త వ్యక్తిని మీటింగ్ ఓ చూశామని చెప్పారు. ఆయన్ని ప్రశ్నిస్తే సంచలన విషయాలు బయటకు వచ్చాయని అన్నారు. టీడీపీ కార్యకర్తను అని చెప్పి ఆయన లోపలకు వచ్చారని అన్నారు. లోపల ఆయన వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో నిలదీశామని బోండా చెప్పారు. తాను ఇంటిలిజెన్సీ కానిస్టేబుల్ ను అని.. ఐజీ సీతారామాంజనేయులు తనను పంపించడంతో వచ్చినట్టు ఆ వ్యక్తి చెప్పాడని అన్నారు. అయితే.. ఆయన నిజంగానే ఇంటిలిజెన్సీ కానిస్టేబులా? కాదా? అనేది తమకు తెలియదని చెప్పారు. ఆయన ఇంటిలిజెన్సీ ఐజీ సీతారామాంజనేయులు పేరు చెప్పారు కాబట్టి ఈ వ్యవహారంపై ఐజీ బాధ్యతపడాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది.

ఇంటెలిజెన్సీ కానిస్టేబుల్‌ పేరుతో వచ్చిన వ్యక్తి దగ్గర ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డుపై జీ విశ్వేశ్వర్ రావు అని ఉందని బోండా అన్నారు. ఆయన నిజంగా ఇంటెలిజెన్సీ కానిస్టేబులా? కాదా? అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. విశ్వేశ్వర్ రావు సెల్‌ఫోన్‌ చూస్తే సంచలన విషయాలు బయటపడ్డాయంటున్నారు. కేశినేని చిన్ని నెంబర్‌ను ట్రాక్ చేస్తూ ఈ సభకు వచ్చాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఆయన సెల్ ఫోన్‌లో ట్రాకింగ్‌కి సంబంధించిన యాప్ ఉండడం, అందులో కేశినేని చిన్ని ఫోన్ నెంబర్ ఉండడాన్ని దానికి ఆధారంగా చూపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు ముందు ట్రాకింగ్ ప్రాసెస్ ఉంటుందని ఇంటెలిజెన్సీలో అధికారులు కొందరు తనకు చెప్పారన్నారు బోండా ఉమ.

కొంతకాలంగా తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరిందని అంటున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి టార్గెట్‌గా ఈ ట్యాపింగ్ జరుగుతుందంటున్నారు. కూటమికి చెందిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ తతంగం మొత్తం ఇంటిలిజెన్సీ ఐజీ నేతృత్వంలోనే జరుగుతుందని కేశినేని చిన్ని ఆరోపించారు. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాల ఆరోపణలపై ఎదురు తిరగడం వైసీపీనేతలకు వెన్నతో పెట్టిన విధ్య. ఈ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబే గతంలో ఫోన్ ట్యాపింగులు చేశారని అన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని రివర్స్ అయ్యారు. అయితే.. ఫోన్ ట్యాప్ అవుతున్నాయని టీడీపీ ఆరోపిస్తే.. దానిపై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని చెప్పాల్సిన అధికార పార్టీ రివర్స్ అవ్వడం అనుమానాలను పెంచుతోంది. అసలు ఈసీకి వైసీపీ ఏమని ఫిర్యాదు చేస్తుందో చెప్పాలి. మరోవైపు చంద్రబాబు టైంలో వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ అయితే.. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఎందుకు విచారణ జరపలేదు? అనే ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -