Bonda Uma: రాయిదాడి జగన్నాటకమేనా.. బోండా ఉమను ఇరికించే విధంగా కుట్ర జరుగుతోందా?

Bonda Uma: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల రాయి దాడి ఘటన పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్రకు భారీ స్థాయిలో ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్ష నేతలు ఓర్వలేక తమపై కుట్ర కొద్దిగా వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విధంగా వైసిపి నేతలందరూ ఈ రాయి దాడిని ఖండిస్తూ ఈ రాయి దాడి ఘటన చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జరిగిందని కామెంట్లు చేస్తున్నారు. విజయవాడలో ఈ ఘటన జరగడంతో ఈ దాడి వెనుక బోండా ఉమా హస్తం ఉందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ రాయి దాడి ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించడం కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే ఈ రాయి దాడి జరిగిన ప్రాంతం నుంచి దాదాపు పది మంది మైనర్లను తీసుకువెళ్లి పోలీసులు వారిని రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టారు ఎలాగైనా ఈ ఘటన తెలుగుదేశం వారే చేయించారు అనేది దిశగా ఒప్పించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. ఈ విషయంపై బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయి దాడి ఘటనకు తనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని కేవలం తనపై రాజకీయంగా కుట్ర చేస్తూ ఈ ఘటనను తనపై వేస్తున్నారని తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు కొంతమంది యువకులను తీసుకెళ్లి వారి చేత బలవంతంగా నా పేరు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా జగన్నాటకమేనని ఆయన సమక్షంలోనే ఈ ఘటన జరిగింది అంటూ బోండా ఉమా విమర్శలు కురిపించారు. రాయి దాడి ఘటనతో ప్రజలలో సానుభూతి పొందడం కోసమే ఇలా వైసిపి పెద్దలు వ్యవహరిస్తున్నారని, తెలుగుదేశంపై ఈ కుట్ర వేయడానికి కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. కానీ రాయి దాడి విషయంలో ప్రజలందరికీ కూడా ఓ క్లారిటీ ఉందని తెలుగుదేశం నేతలు ఈ ఘటనను పూర్తిగా ఖండిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -