Loans: అప్పు చేయకూడదని రోజులేవంటే.. ఇలా అస్సలు చేయకండి!

Loans: నిత్య జీవితంలో చాలా మందికి అప్పడప్పుడూ అప్పు చేయడం లాంటి పనులు చేస్తుంటారు. చేబదుళ్లు కావచ్చు, లోన్లు కావచ్చు, వడ్డీ వ్యాపారుల వద్ద చేస్తున్న అప్పు కావచ్చు.. ఇలా అనేక రకాలుగా అప్పులు చేస్తుంటారు చాలా మంది. ఒకానొక సమయంలో అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితులు ఉంటాయి చాలా మందికి. ఇలాంటి సమయంలో తప్పని సరి పరిస్థితుల్లో అప్పులు చేసేస్తుంటారు. ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు లాంటివి కూడా అప్పుల కిందకే వస్తాయి.

అయితే, ఏ సమయాల్లో అప్పు చేస్తున్నారో కాస్త గమనించుకోవాలి. అప్పు చేసే ముందు కాస్త ఆలోచించుకోవాలి. వాస్తు శాస్త్రంలో వారంలో కొన్ని రోజులు అప్పు చేయకూడదని చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అప్పులు చేయడం వల్ల జీవితాంతం తీర్చడం కష్టం అవుతుందని చెబుతున్నారు. అందుకే సరైన సమయాల్లో మాత్రమే అప్పులు చేయడం ద్వారా త్వరగా తీర్చుకోవడానికి వీలవుతుంది.

తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయడం వల్ల ఆ వ్యక్తిలో ఆందోళన ఏర్పడుతుంది. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఒక్కోసారి అప్పులు ఎక్కువైతే వాటిని తీర్చలేక మానసికంగా కుంగిపోతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు తీసుకొనేందుకు కొన్ని సమయాలు, నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం శుభముహూర్తంలో రుణాలు తీసుకోవడం వల్ల సులభంగా తీర్చేయగలరు.

ఏయే రోజుల్లో అప్పు చేయవచ్చంటే..
మంగళవారం, బుధవారం, శనివారాల్లో అప్పులు చేయరాదని పండితులు చెబుతున్నారు. అలాగే హస్త, మూల, ఆరుద్ర, జ్యేష్ట, విశాఖ, ఉత్తరాఫాల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద, రోహిణి మొదలైన నక్షత్రాల్లో అప్పులు చేయకూడదని స్పస్టం చేస్తున్నారు. ఈ సమయంలో తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుందట. ఎవరికైనా అప్పు బకాయి ఉంటే మంగళవారం దాన్ని చెల్లించే ప్రయత్నం చేస్తే మంచిదని చెబుతున్నారు. ఇక సోమ, గురు, శుక్ర, ఆది వారాల్లో అప్పులు తీసుకుంటే మంచిదట. ఇవి శుభప్రదమైన రోజులుగా చెబుతున్నారు. స్వాతి, పునర్వసు, ధనిష్ట, శతభిష, మృగశిర, రేవతి, చిత్ర, అనురాధ, అశ్విని, పుష్య నక్షత్రాలలో రుణం తీసుకోవడం వల్ల వాటిని త్వరగా తీర్చుకోవడానికి వీలవుతుందని పండితులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -