Mahesh Babu: ఏడాదిలో మూడు విషాదాలు.. పాపం మహేష్ అంటూ?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి, టాలీవుడ్ లెజెండరీ హీరో కృష్ణ స్వర్గీయులయ్యారు. గత కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో జాయిన్ చేయించగా.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో మహేష్ బాబు ఫ్యామిలీ దుఃఖంలో మునిగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబుకు మాత్రం భారీ విషాదాన్ని మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 8న కన్ను మూశాడు.

 

అన్నయ్య రమేశ్ బాబును కోల్పోయిన బాధ నుంచి మహేష్ బాబు తేరుకోకముందే.. తల్లి ఇందిరాదేవి అనారోగ్యానికి గురయ్యారు. సెప్టెంబర్ 28న ఆమె కూడా మరణించారు. తల్లి ఇందిరాదేవి దూరమైన బాధను మరచిపోతున్న తరుణంలో కన్నతండ్రి కన్నుమూశాడు. ఈ ఘటన మహేష్ బాబును మరింత విషాదంలోకి నెట్టింది. అయితే నటుడు కృష్ణకు గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అవ్వడం వల్లే మరణించినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాంటినెంటల్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ..‘గుండెపోటు సమస్యతో నటుడు కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతడిని వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్ చేశాము. ఈ తర్వాత చికిత్స ప్రారంభించాము. అయితే ఆస్పత్రిలో వచ్చినప్పటి నుంచే కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉంది. 2, 3 గంటల తర్వాత అవయవాలు పని చేయడం మానేశాయి. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం లేదనిపించింది. ఈ రోజు తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుదిశ్వాస విడిచారు.’ అని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -