Alla Ramakrishna Reddy: రెండు నెలలు అండర్ కవర్ ఆపరేషన్ చేసిన ఆర్కే.. 60 రోజుల్లో ఏం సాధించాడంటూ?

Alla Ramakrishna Reddy: ఆయారామ్.. గాయారామ్.. భారత్ రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన సామెత ఇది. రామ్ వచ్చారు.. రామ్ వెళ్లారని దీనర్థం. 1970 తొలినాళ్లలో ఉత్తరాదిలో రామ్ అనే రాజకీయ నాయకుడు పద్నాలుగు రోజుల్లోనే మూడు సార్లు పార్టీ మారారు. దీంతో.. అప్పటి నుంచి ఆయారామ్.. గాయారామ్ అనే మాట ఓ సామెతలా మారిపోయింది. అయితే, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యవహారం అలాగే ఉంది. జగన్ అవినీతిపరుడని.. మంగళగిరిని అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తూ ఆయన 40 రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశాడు. అప్పడు అదో సంచలనంగా మారింది. కొంతమంది ఆర్కే వైసీపీకి రాజీనామా చేయడమేంటీ అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడంలో ఆయనదే కీలక పాత్ర. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై కేసులు వేసింది ఆయనే. అలాంటి ఆర్కేను జగన్ వదులకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే మాట జోరుగా వినించింది.

ఆర్కే రాజీనామా చేసిన తర్వాతే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో.. ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాదు.. జగన్ అవినీతిపై కోర్టు వెళ్తానని ప్రకటించారు. అయితే, ఏమైందో తెలియదు కానీ.. నలబై రోజుల్లోనే ఆయన మళ్లీ వైసీపీలో వచ్చి చేరారు. దీంతో.. ఆయారాం గాయారం సామెతను గుర్తు చేశారు. అయితే, ఇక్కడ ఈ ఆయారం గాయారం సామెత సందర్భానుసారంగా రాలేదని.. ఆ సందర్బాన్ని ఆర్కే తీసుకొచ్చారని చర్చ నడుస్తోంది. జగన్ తో విభేదించి ఆయన కాంగ్రెస్ లోకి రాలేదని.. అంతా ఓ పద్దతి ప్రకారమే జగన్ పంపిచారని తెలుస్తోంది.

షర్మిల ఏపీలోకి వస్తారు అని తెలిసినప్పటి నుంచి ఆర్కే వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. దూరంగా ఉంటున్నట్టు పరిస్థితులను క్రియేట్ చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నపుడు హస్తం పార్టీలో చేరికలు ఆయనతోనే మొదలయ్యాయి. దీంతో.. వైసీపీలో అసంతృప్తులకు కాంగ్రెస్ ఓ వేదిక అవుతుందని అంతా భావించారు.

అయితే, ఇదంతా ఓ నాటకమని ఇప్పుడే తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ వ్యూహాలను తెలుసుకోవడానికే ఆర్కేని జగన్ ఆ పార్టీలోకి పంపారని తెలుస్తోంది. ఎందుకంటే.. జగన్ కు చంద్రబాబు, పవన్ కంటే షర్మిలతోనే ఎక్కువ నష్టమని తెలుసు. చంద్రబాబు, పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకుండా ప్రయత్నిస్తారు. కానీ, కాంగ్రెస్ బలపడితే.. వైసీపీ ఓట్ బ్యాంక్ అటు వైపు మళ్లే ఛాన్స్ ఉంది. అందుకే.. జగన్ కు కాంగ్రెస్ అడుగులు తెలియాలి. దీంతో.. ఆయన్ని షర్మిలకు సన్నిహితంగా ఉండటం కోసం పంపించారు. కాంగ్రెస్ నేతలకు నమ్మకం కలిగేలా రాజారెడ్డి పెళ్లికి జగన్ ను ఆహ్వానించడానికి షర్మిలతో పాటు తాడేపల్లికి వెళ్లారు. ఇలా అడుగుడుగునా షర్మిలతో ఉండి.. ఆమె వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ, షర్మిలకు కూడా ఆర్కే అడుగులు అనుమానాస్పదం అనిపించడంతో ఆమె దూరం పెట్టింది. అందుకే, పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఆయన సైలంట్ అయ్యారు. పెద్దగా యాక్టివ్‌గా లేరు. దీంతో.. అండర్ కవర్ ఆపరేషన్ వలన ఉపయోగం లేదని మళ్లీ వైసీపీ గూటికి చేరారు. దానికి ఏదో ఒక కారణం చెప్పాలి కనుక.. జగన్ కు వ్యతిరేకంగా అందరూ ఏకం అవుతున్నారని ఆరోపించారు.

పేదలందరికీ న్యాయం జరగాలి అంటే వైసీపీలోనే సాధ్యం అన్నారు. అయితే, 40 రోజుల క్రితం జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుందా? ఆర్కే సమాధానం చెప్పాలి. అంతేకాదు.. మంగళగిరిలో పెండింగ్ లో ఉన్న పనులు అన్ని పూర్తి దశకు చేరుకున్నాయని.. అందుకే వైసీపీలో చేరానని చెబుతున్నారు. ఐదేళ్లుగా పూర్తి కాని పనులు 40 రోజుల్లోనే జరిగాయా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇవన్ని పక్కన పెడితే.. ఇదో కోవర్ట్ ఆపరేషన్ అని చెప్పడానికి మరో సాక్ష్యం స్పీకర్ చర్య. గంటా శ్రీనివాస్ రావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్ తమ్మినేని.. ఆళ్ల రామకృష్ణ రాజీనామాను ఆమోదించలేదు. దీంతో.. ఇదంతా జగన్ ప్లాన్ అని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -