Actor Sri Reddy: శ్రీ రెడ్డి కి పెళ్లి చూపులు.. పెళ్లి కొడుకు ఎవరో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే?

Actor Sri Reddy: శ్రీ రెడ్డి మన రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికీ సుపరిచితురాలే. నోరు తెరిస్తే చాలు పచ్చి బూతులు మాట్లాడుతూ విరుచుకుపడే శ్రీరెడ్డి, అవతల వ్యక్తి ఎంత పెద్ద స్టార్ అయినా ఏ మాత్రం లెక్కచేయకుండా పచ్చి బూతులను వాడుతూ విమర్శిస్తుంది. శ్రీ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తలలో నిలుస్తుంది. గత ఐదు సంవత్సరాలుగా శ్రీ రెడ్డి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బాగా పాపులర్ అయింది. శ్రీ రెడ్డి స్టార్ హీరోల పైన కాదు, స్టార్ హీరోల పిల్లలపై కూడా ఆమె బాంబు పేల్చింది. వారి పెళ్లిళ్లు, విడాకులపై ఆమె తరహాలో కాటు వ్యాఖ్యలు చేసింది. వాళ్లు విడిపోవడానికి కారణాలు ఏంటో కూడా ఆమె చెప్పింది.

అలాగే శ్రీ రెడ్డి కు యూట్యూబ్ లో ఓ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లో తెలుగు వంటకాలను చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి వీడియోలోనూ వంటకాల గురించి చెబుతూ సరదా చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ వీడియోలో శ్రీ రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేసింది. తనకు పెళ్లిచూపులని.. అది కూడా ఓ తెలంగాణకి చెందిన అబ్బాయితో అని ఆమె చెప్పింది.

ఆ వీడియో చూసిన వాళ్ళందరూ షాక్కుకురయ్యారు. ఇక ఈమె పెళ్లి చేసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే విషయం ఏంటి అంటే.. శ్రీరెడ్డి తన యూట్యూబ్ వీడియోలో పెళ్లి చూపులు అని తన తాతయ్య చెప్పగానే బాగా రెడీ అయిపోతుంది.. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో పెళ్లి చూపులు చూసిన ఆమెకు పెళ్లి ఎవరితో కూడా ఫిక్స్ అయ్యి ఉండదు.

ఇక పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీ రెడ్డి పెళ్లి చూపులకి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత తన తాతయ్య కంజుల పిట్టలను తీసుకొచ్చి పెళ్ళికొడుకుకి కంజు ఫ్రై చేసి ఇవ్వమని చెప్తాడు. పెళ్లి కొడుకు కోసం కదా.. అని శ్రీ రెడ్డి వీడియో లో కంజు ఎలా చెయ్యాలో, ఏ పదార్థాలని వాడాలో వీడియో కి చూపిస్తూ.. కంజు ఫ్రై చేస్తుంది.

పెళ్లి కొడుకును ఎప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్న ఆమె.. ఇక పెళ్లి కొడుకుని ఇప్పుడు పిలిపించు అని తాతయ్యతో ఆమె చెప్పగా.. మందు కోసం డబ్బులు ఇవ్వు అని ఆ తాతయ్య చెప్తాడు. దీంతో ఇదంతా మందు ప్లాన్ అని.. శ్రీ రెడ్డికి ఎలాంటి పెళ్లిచూపులు లేవని శ్రీ రెడ్డి గ్రహిస్తుంది. దీంతో ఆ తాతయ్య మందు కోసం అలాగే కంజు ఫ్రై కోసం ఆడిన నాటకం చేశాడని తాతయ్యను తిడుతుంది. ఇది చూసిన నెటిజన్లు అవాక్ అవుతున్నారు ఇదెక్కడి ప్రాంక్ రా బాబు అని కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -