God Father: మరో ఆచార్య కాకూడదని దణ్ణం పెట్టుకుంటున్న అభిమానులు.. ఏమైందంటే?

God Father: తెలుగు ప్రేక్షకులకు ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో చిరంజీవి, తన వారసుడు రామ్ చరణ్ లు కలిసి నటించారు. ఇక ఇద్దరు స్టార్లు ఒకే స్క్రీన్ పై కనపడడం, అందులో తండ్రి కొడుకులు కావడంతో ఈ సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన రోజే భారీ స్థాయిలో డిజాస్టర్ అయినట్లు తెలుస్తుంది. చిరంజీవి సినిమా అంటే ఒకప్పుడు టికెట్ల కోసం జనం ఎగబడేవారు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి నటుడు ఆచార్య సినిమాలో నటించినప్పుడు టికెట్లు భారీ స్థాయిలో పోవాలి. కానీ ఆచార్య సినిమాకి కొన్ని థియేటర్లలో ఆక్యుఫెన్సీ కనిపించలేదు. ఏదేమైనా చిరు, రామ్ చరణ్ కలయికని చాలామంది పట్టించుకోలేదు.

కాగా ఈ సినిమా విషయంలో మెగా అభిమానులు చాలా నిరాశపడ్డారు. మరి అంత భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయిన ఆచార్య సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ అయింది. ఇప్పుడు విడుదల కాబోయే గాడ్ ఫాదర్ సినిమా సంగతి ఏమిటి అని మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. పలువురు స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నప్పటికీ ఎలాగైనా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ఎవరూ ఊహించడం లేదు. దీనికి కారణం మలయాళం రీమేక్ లూసిఫర్ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

ఈ సినిమాను ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో వీక్షించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విషయంలో గాడ్ ఫాదర్ కి లూసిఫర్ కి పోలికలు పెట్టి జనం ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సూపర్ హిట్ టాక్ నడిస్తే దసరా హాలిడేస్ లో గాడ్ ఫాదర్ సినిమా మంచిగా వర్కౌట్ అవుతుంది. కానీ చాలామంది ట్రెడ్ నిపుణులు కూడా మొదటిరోజు గాడ్ ఫాదర్ పరిస్థితిని అంచనాలు వేయలేకపోతున్నారు. కనుక ఈ సినిమా మరో ఆచార్య కాకూడదని మెగా అభిమానులు మనసులో దణ్ణం పెట్టుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -