Megastar Chiranjeevi: అప్పట్లో చిరంజీవి ఆ హీరోయిన్ ను ప్రేమించాడా?

Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ అనే పేరు పరిచయం అక్కర్లేదు. పునాదిరాళ్లు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై.. ఆపై పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాడు. దాదాపు నాలుగు దశాబ్దాల ప్రేక్షకులను చిరు హీరోగా మెప్పించాడు. చిరంజీవి కష్టపడి పైకి వచ్చిన వారిలో ఒకరు.. తాను తన జీవితాన్ని ఎంతో నేర్పుగా.. సహనంతో ముందుకు నడుపుకున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా చిరంజీవి తాను నటించిన సినిమాల్లో డాన్స్ చేయడానికి.. ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటాడు. నిజానికి సినిమా రంగాన్ని చిరంజీవి అన్ని వైపులా చదివేసి వచ్చాడని చెప్పవచ్చు. 1980 కాలంలో చిరంజీవి అప్పటి స్టార్ హీరోయిన్లు విజయశాంతి, రాధిక, రాధ లాంటి హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేశాడు.

అప్పట్లో హీరోయిన్ రాధ ఎంతో అందంగా కనిపించేది. ఇక చిరంజీవి, రాధ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసేవాళ్ళు. రాధ తో చిరంజీవి దొంగ, నాగు, స్టేట్ రౌడీ, కొండవీటి దొంగ వంటి సినిమాలు చేశాడు. అప్పట్లో స్క్రీన్ పై వీరిద్దరి రొమాన్స్ మరో స్థాయిలో పండేది. చిరంజీవి, రాధ డ్యూయెట్ వేసుకుంటే.. ఇప్పటి ప్రేక్షకులు ఈలలు వేస్తూ..గోల చేసేవారు.

నిజంగా వీరిద్దరి కాంబినేషన్ కు పిచ్చి క్రేజ్ ఉండేది. అప్పట్లో వీరిద్దరూ తెగ ఫ్రెండ్లీగా ఉండేవారట. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలో నటించారు. దాంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ఏఫైర్ ఉన్నట్లు కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. కొన్ని సమయాల్లో తమిళ ఇండస్ట్రీ కూడా వీళ్ళిద్దరూ మధ్య ఎఫైర్ ఉందన్నట్లు.. పత్రికల రూపంలో స్టేట్మెంట్స్ వచ్చింది. కానీ ఈ పుకార్ల ను చిరంజీవి ఏమాత్రం పట్టించుకునే వాడు కాదు. ఇక రాధ కూడా ఈ విషయాలన్నిటినీ పూర్తిగా లైట్ తీసుకునేది. ఇక ఏదేమైనా చిరంజీవి ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -