Pawan – Chiranjeevi: పవన్ కు పరోక్షంగా సహాయం అందిస్తున్న చిరు.. జనసేన గెలుపు కోసం వెనుకడుగు వేసే ఛాన్స్ లేదా?

Pawan – Chiranjeevi: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఆర్థికంగా సహాయం చేశారు జనసేన పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసింది. అయితే పార్టీ కార్యక్రమాల కోసం చిరంజీవి ఐదు కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అయితే ఈ ఐదు కోట్లు కేవలం విరాళంగా ప్రకటించారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఐదు కోట్ల విరాళం కనుక ఇవ్వాలి అనుకుంటే సైలెంట్ గా ఇవ్వచ్చు కానీ ఇది ఒక కార్యక్రమంలో ఏర్పాటు చేసి మరి తన తమ్ముడు చేతిలో ఐదు కోట్ల విరాళం పెట్టారు అంటే దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందని పలువురు భావిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అభిమానులలో కొందరి చిరంజీవికి వ్యతిరేకంగా ఉండగా మరికొందరు పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శిస్తున్నారు అలాగే మరికొందరు జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ఇలా మెగా అభిమానులు రాజకీయాల పరంగా విభిన్నదారులలో విభిన్న ఆలోచనలలో ఉండటంతో వారందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి తన తమ్ముడికి మద్దతు తెలిసేలా చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఐదు కోట్ల విరాళం ఇచ్చారని తెలుస్తుంది. ఇలా విరాళం పేరుతో తన అభిమానులందరికీ చిరు పవన్ కి మద్దతు తెలియజేయాలని చెప్పకనే చెప్పేశారు.

ఇలా తన తమ్ముడి కోసం చిరంజీవి మొదటి అడుగు ముందుకు వేశారు .తన తమ్ముడిని ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో చూడాలన్న లక్ష్యంతోనే చిరంజీవి కూడా తన తమ్ముడికి వెనకుండా ముందుకు నడిపిస్తున్నారని ఇకపై తమ్ముడి విషయంలో వెనకడుగు వేసే ఛాన్సే లేదని నేటితో స్పష్టంగా అర్థమైంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -