MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు చేస్తాయనే విషయం కూడా మరిచిపోతారేమో సదరు రాజకీయ నాయకులు. ప్రస్తుతం గ్రంధి శ్రీనివాస్ ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే కొన్ని రోజుల వరకు జగన్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికి విషయం అందరికీ తెలిసిందే.

జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా మద్దతు పలికారు చిరంజీవి. అయితే ప్రస్తుతం చిరంజీవి తన పూర్తి మద్దతు జనసేనకు, ఎన్డీఏ కూటమికి తెలియజేస్తున్నారు. వారికే ఓటు వేయాలని పిలుపుని కూడా ఇస్తున్నారు చిరంజీవి. అసలే ఎన్డీఏ కూటమి బలాన్ని పుంజుకుంటుంది దానికి తోడు చిరంజీవి కూడా కూటమికి సపోర్ట్ చేయటాన్ని భరించలేక పోతుంది వైసీపీ ప్రభుత్వం. పర్యావసానంగా చిరంజీవి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా చిరంజీవిని టార్గెట్ చేయడం గమనార్హం.

2019లో పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి అయిన గ్రంధి శ్రీనివాస్ అయితే విచిత్రమైన వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలవుతున్నారు. చిరు పక్కా కమర్షియల్ అని తన సినిమాల మనుగడ కోసమే పవన్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చిరంజీవి టికెట్ల రేటు వ్యవహారం మీద సీఎం జగన్ ని కలిసినప్పుడు ఆయన నమస్కారం చేస్తే జగన్ ప్రతి నమస్కారం చేయలేదని గొడవ చేశారని అలాగే చిరంజీవి సినిమాలు చూడొద్దు అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడంతో తర్వాత వచ్చిన చిరంజీవి సినిమాలకి మినిమం ఓపెనింగ్స్ రాలేదని విచిత్ర వాదన వినిపిస్తున్నారు.

అంతేకాకుండా ఐదు ఆరు నెలలలో తన కొత్త సినిమా విశ్వంభర రిలీజ్ అవుతుందని, అప్పుడు సినిమాకి పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్ట్ కోసమే చిరంజీవి జనసేనకు ఐదు కోట్లు ఫండ్ ఇచ్చాడని చెప్తున్నారు గ్రంధి శ్రీనివాస్. ఈ మాటలు విన్న సదరు ఓటర్లు నవ్వాలో ఏడవలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు. పవన్ అభిమానుల సపోర్టు లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఆడలేని దుస్థితిలో ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ మూర్ఖత్వానికి ఈ సంఘటన ఒక పరాకాష్ట అంటూ నవ్వుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -