Chiranjeevi Donation: జనసేనకు మెగాస్టార్ రూ. 5 కోట్ల విరాళం. వైసీపీ వెన్నులో వణుకుపుట్టిస్తున్నా మెగా బ్రదర్స్

Chiranjeevi Donation: రాజకీయాలకు తాను దూరమైనా.. రాజకీయాలు తనకు దూరంగా కావడం లేదని చిరంజీవి ఒకటి, రెండు సార్లు అన్నారు. ఏ ఉద్దేశ్యంతో అప్పుడు అన్నారో తెలియదు కానీ.. మరోసారి పరోక్ష రాజకీయాలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో రాజకీయాలు ఆయనతోనే ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2014 నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. కానీ, మిగిలిన పార్టీలు చిరంజీవిన లెగసీని వాడుకునే ప్రయత్నం చేశాయి. వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో తొలి వరుసలో ఉండేవారు. అందుకే.. పవన్ కల్యాణ్ ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా చిరంజీవికి కొంత గౌరవం ఇచ్చేవారు. అటు బీజేపీ కూడా చిరంజీవిని ఆకర్షించడానికి ప్రయత్నం చేసేది. కానీ, ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహిరిస్తూ వచ్చేవారు. అందరికి సమ దూరం పాటించేవారు. ప్రభుత్వం పెద్దలను ఎవరినైనా కలిసినా.. ఇండస్ట్రీ పెద్దగానే వెళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం తన మద్దతు జనసేనకే అని పరోక్షంగా ప్రకటించారు.

చిరంజీవి రాజకీయాలకు స్వస్తి పలికిన తర్వాత పవన్ జనసేన పార్టీ పెట్టారు. ప్రశ్నించడానికే అంటూ పార్టీ పెట్టి ఆనాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ఏర్పాటుకు జనసేన కీ రోల్ పోషించిన విషయం భాహాటంగా అందరూ ఒప్పుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీలో తన ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు మాత్రమే ఉన్నారు. ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ అయిన మెగాస్టార్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి..ఇప్పుడు అనూహ్యంగా బాంబ్ పేల్చారు. తన తమ్ముడి పార్టీ అయిన జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తన సపోర్ట్ జనసేనకే అని మెగాస్టార్ కుండబడ్డలు కొట్టడం అధికార వైసీపీకి చెమటలు పట్టిస్తోంది. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న చిరు విశ్వంభర షూటింగు స్పాట్ కు నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి వెళ్లారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో చిరంజీవి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం పార్టీ ఫండ్ గా 5 కోట్ల రూపాయల చెక్ ను పవన్ కు చిరు అందజేశారు.

తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల మధ్య అరగంటపాటు మాటామంతి జరిగింది. అనంతరం తన విరాళానికి చెందిన చెక్కును పవన్ కు చిరు అందించారు. ఈ మేరకు భావోద్వేగానికి గురైన పవన్ తన చిరుకు పాదాభివందనం చేశారు. ఈ ఊహించని పరిణామంతో వైసీపీకి ఇక ఓటమి ఖాయమని కూటమి నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కూటమికి మెగాస్టార్ సపోర్ట్ చేయడంతో వైసీపీకి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ షాకింగ్ ఘటనతో జగన్ సైతం ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారని అనుకుంటున్నారు. చిరు ప్రకటనతో మెగా ఫ్యామిలీ లోని మిగిలిన హీరోలు కూడా ఒక్కొక్కరిగా బయటకి వచ్చి మద్దతు ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఇక కూటమికి మెగా అభిమానులు కూడా తోడైతే వైసీపీకి ఘోర పరాజయం పక్కా అని ప్రజలతో పాటు సోషల్ మీడియా సైతం కోడై కూస్తుంది.

మరోవైపు చిరంజీవి మద్దతును అంత ఈజీగా తీసేయడానికి లేదు. ఎందుకంటే.. గతేడాది మాజీ మంత్రి కొడాలి నాని చిరంజీవిపై తన నోటి దురుసు చూపించారు. ప్రతీ పకోడీగాడు ప్రభుత్వానికి చెప్పినోడే అని అన్నారు. ఆ తర్వాత రోజే.. ఆయన తన మాటలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కవర్ చేశారు. అయినా చిరంజీవిని విమర్శిస్తే రాజకీయాలు చేయలేమని.. ఆయన్ని వ్యతిరేకించి ఎవరైనా గెలవగలారా? అని స్వయంగా కొడాలినాని అన్నారు. ఆ మాత్రం అవగాహన నాకు లేదా? అని అన్నారు. అంటే..చిరంజీవి మద్దతు ఏ పార్టీకైనా ఎంత అవసరమో కొడాలి నాని చెప్పారు. అందుకే.. వైసీపీ అధిష్టానానికి చెమటలు పడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -