God Father: చిరుకి క‌లిసొచ్చిన రీమేక్‌!

God Father: ఆచార్య‌తో చిరంజీవి ఫ్యాన్స్ చాలా అయోమయంలోకి వెళ్ళియారు. అందరి నుంచీ విమ‌ర్శ‌లే ఎదురయ్యాయి. చిరంజీవి ఇక రిటైర్ అయిపోవొచ్చేమో..? అనేంత‌గా బాధను కలిగించి. ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశ‌కు గురి చేశాయి. అయితే… చిరు `గాడ్‌ఫాద‌ర్‌` సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు మళ్ళి విజయాన్ని అందుకొంటున్నారు. ఈ సినిమాలో చిరు పెర్‌ఫార్మ్సెన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, వ‌స్తున్న స్పంద‌న‌ వ‌సూళ్ళు.. ఇలా అన్ని కలిసి అభిమానుల‌కు ప్రాణం తిరిగి వచ్చినటైనది.

వాస్తవానికి చిరంజీవి తీస్తున్న సినిమా లూసీఫ‌ర్ కి రీమేక్ అన‌గానే ఫ్యాన్స్ లో కూడా నిరాశ మొదలయింది. లూసీఫ‌ర్ చిరంజీవి సరిపడే సినిమా కాదు క‌దా, అని భ‌య‌ప‌డ్డారు. చిరు సినిమాల్లో రొటీన్ గా క‌నిపించే పాట‌లు,కామెడీ, రొమాన్స్ ఏమీ లేకపోయిన కూడా చిరు అందరిని మెప్పించ‌గ‌ల‌డని గాడ్ ఫాద‌ర్ సినిమాతో నిరూపించాడు.

చిరు రూటు మార్చాల్సిన సమయంలో.. గాడ్ ఫాద‌ర్ సినిమా చిరంజీవి సినీ జీవితానికి ఓ పునాది రాయిగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే చిరంజీవికి కూడా వ‌య‌సు ఎక్కువైపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వయస్సులో డాన్సులు, రొమాన్సుల‌తోనే అభిమానుల్ని మెప్పించాలని అనుకోవ‌డం అత్యాసే. అయినప్పటికీ చిరుకి రీమేకులు,ఆయ‌న రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెం.150 బాగా క‌లిసొచ్చాయి.

తొమ్మిదేళ్ల త‌ర‌వాత చిరంజీవి సినిమా చేసినా – అభిమానులు మ‌ళ్లీ ఆదరించి భారీ వ‌సూళ్లను అందించారు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన సైరా, ఆచార్య‌… రెండూ వ‌ర్జిన‌ల్ క‌థ‌లు. రెండూ నిరాశ క‌లిగించిన త‌రుణంలో ఈ రీమేక్ చిరు కెరీర్‌కి ప్రాణం పోసిన‌ట్టైంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -