Chiranjeevi: కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా ఏది చేయాలన్న బ్రహ్మే.. చిరంజీవి వైరల్ ట్వీట్!

Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన సొంత టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి 150 సినిమాలకు పైగా నటించి ప్రస్తుతం అగ్ర స్టార్ హీరోగా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోనీ స్థాయిలో చిరంజీవి సినిమా అవకాశాలు అందుకుంటూ నటనపరంగా ప్రేక్షకులను బాగా కట్టుకుంటున్నాడు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు అనగా అక్టోబర్ ఐదున విడుదలవుతుంది. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రమోషన్ లు ఈ చిత్రం బృందం బాగా చేస్తున్నారు.

ఇక తాజాగా ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్ అయినా.. కింగ్ మేకర్ అయినా.. క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక వాయిస్ పోస్ట్ చేశాడు. ఈ వాయిస్ డైలాగ్ తో గాడ్ ఫాదర్ సినిమా మరింత హైప్ క్రియేట్ చేసుకుంది. ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో హడావిడి చేయబోతుంది. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

ఇక గాడ్ ఫాదర్ సినిమా విషయంలో చిరంజీవి మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చాలామంది ఆచార్య సినిమాతో చిరంజీవి పని అయిపోయింది అన్నట్లుగా మాట్లాడారు. మరి అలాంటివారికి చిరు గాడ్ ఫాదర్ సినిమాతో మంచి సమాధానం చెబుతాడని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి గాడ్ ఫాదర్ సినిమా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -