KTR-Chandrababu: బాబుపై కేటీఆర్ ప్రేమ వెనుక అసలు కథ ఇదేనా.. ఓట్ల కోసం ఆయన ఇలా చేస్తున్నారా?

KTR-Chandrababu:  చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పెద్ద సంచలనమే రేకెత్తింది. ఎక్కడ చంద్రబాబు వర్గం వారు ఆందోళనలు చేపడుతారో అని కేటీఆర్ ఎలాంటి ఆందోళనలోకి, రాస్తారోకోలకి పర్మిషన్ ఇవ్వలేదు. కేటీఆర్ చర్య పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.దీంతో ఒక అడుగు వెనక్కి వేసిన కేటీఆర్ తెదేపా వర్గీయులని శాంతింప చేయటం కోసం ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి ఆయనని ఆకాశానికి ఎత్తేశారు.

ఆ పేరులోనే వైబ్రేషన్ ఉందని, ఆ స్ఫూర్తితోనే తన తండ్రి తనకు తారక రామారావు అని పెట్టారని అన్నారు. అయితే సడన్గా చంద్రబాబు ఆరోగ్యం పై సానుభూతి కురిపిస్తున్న కేటీఆర్ ని చూసి ఇంత సానుభూతి ఏంటి, ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది అంటూ సెటైర్లు వేస్తున్నారు చంద్రబాబు వర్గం వారు. ఇంతకీ కేటీఆర్ ఏం చేశాడంటే చంద్రబాబు అనారోగ్యం పాలవుతున్నారని, ఆయనకు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

అధికార యంత్రాంగం చంద్రబాబు ఆరోగ్యం గురించి ఏదో దాచిపెడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ చూసిన కేటీఆర్, నారా లోకేష్ చేసిన ట్వీట్ చాలా బాధ కలిగించిందని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని కుమారుడిగా తండ్రి ఆరోగ్యం పై ఆందోళన ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన సమయంలో మనకు కూడా అలాంటి ఆందోళన కలిగిందని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు ఏపీలోని తెదేపా వైఎస్ఆర్ సీపి వ్యవహారమని..

హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ ఆందోళనలు వద్దంటున్నామని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. అయితే ఇంత సడన్గా కేటీఆర్ లో ఇంత మార్పు ఏమిటి అని ఆశ్చర్యపోవటం మిగిలిన రాజకీయ నాయకుల వంతైంది. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని విశ్లేషిస్తే నారా లోకేష్ అమిత్ షా భేటీలో భాజపా రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో బీజేపీ, తెదేపా ఒకటైపోతే తెదేపా ఓట్లు కూడా భాజపా కి షిఫ్ట్ అయిపోతాయి. ఇది కూడా టీఆర్ఎస్ కి పెద్ద దెబ్బ అవుతుంది. దాంతో కేటీఆర్ ప్లేట్ ఫిరాయించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -