RK Roja-Pawan Kalyan: పవన్ పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి.. కానీ రోజా కామెంట్స్ వైరల్!

RK Roja-Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గానే ఉంటాయి.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మూడు రాజధానుల విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా ఈ విషయాన్ని జనసేన, టిడిపి ప్రభుత్వం తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు.

ఈ క్రమంలోనే నేడు విశాఖ గర్జన పేరిట వైసీపీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. ఇక ఈ సందర్భంగా ఏపీ మంత్రి, నటి రోజా మాట్లాడుతూ నటుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ ఏపీ రాజధాని అమరావతి అంటూ అమరావతి కే మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి, ఆయన సినిమా షూటింగులు చేసుకోవడానికి వైజాగ్ కావాలి. నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి చివరికి ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి, కానీవైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడతామంటే వద్దంటారు అంటూ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ తన మొదటి వివాహాన్ని వైజాగ్ కు చెందిన నందిని అనే అమ్మాయితో జరిగిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తుచేస్తూ మంత్రి రోజా పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అవసరమైంది కానీ పరిపాలనను వైజాగ్ నుంచి కొనసాగిస్తామంటే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -