Hero-Heroine: ఈ హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే మాత్రం కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే!

Hero-Heroine:  మనం వెండితెరపై హీరో హీరోయిన్లు చేసే రొమాన్స్, కామెడీ అన్ని చూస్తాం. వాళ్ల పెయిర్ చాలా బాగుంది అనుకుంటాం. కానీ కానీ వాళ్ళ ఏజ్ గ్యాప్ చూస్తే మాత్రం నోరెళ్ల పెడతాం. నిజానికి హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ అనేది పాత తరం నుంచి కూడా వస్తుంది. అలా మాట్లాడుకుంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది శ్రీదేవి, ఎన్టీఆర్ ల ఏజ్ గ్యాప్ గురించి.

శ్రీదేవి ఎన్టీఆర్ ఒకప్పుడు గొప్ప హిట్ పెయిర్. కానీ శ్రీదేవి చిన్నప్పుడు ఎన్టీఆర్ కి మనవరాలుగా నటించిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే చాలామంది హీరో హీరోయిన్ల ఏజ్ డిఫరెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున, లావణ్య త్రిపాఠి ల పెయిన్ చాలా బాగుంది. అయితే వాళ్ళిద్దరూ ఏజ్ గ్యాప్ మాత్రం 32 సంవత్సరాలు.

అలాగే నేనున్నాను సినిమాలో నాగార్జున, శ్రియ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ 23 సంవత్సరాలు. అలాగే కింగ్ సినిమాలో నాగార్జున, త్రిష కి మధ్య ఉన్న ఏస్ గ్యాప్ 24 సంవత్సరాలు. అలాగే సరిలేరు నీకెవ్వరులో కలిసి నటించిన మహేష్ బాబు, రష్మిక మధ్యన ఏజ్ 21 సంవత్సరాలు. అలాగే బంగార్రాజు సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య, కృతి శెట్టిల ఎస్ గ్యాప్ 17 సంవత్సరాలు. జై సింహా లో బాలకృష్ణ, నటాషా దోషి మధ్య ఏజ్ గ్యాప్ 33 సంవత్సరాలు.

అలాగే రోబో 2.0 సినిమాలో కలిసి నటించిన రజనీకాంత్, అమీ జాక్సన్ ల ఏజ్ గ్యాప్ అయితే మరి ఘోరంగా 40 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. కానీ ఆ గ్యాప్ ఎక్కడ కనిపించకుండా మంచి పెయిర్ అనిపించుకున్నారు వీళ్లిద్దరూ. అలాగే శ్యాం సింగరాయ్ సినిమాలో నానీకి, కృతి శెట్టి మధ్య ఏజ్ గ్యాప్ 19 సంవత్సరాలు. అలాగే అజ్ఞాతవాసి సినిమాలో కలిసిన నటించిన పవన్ కళ్యాణ్, అను ఇమాన్యుల్ మధ్య 26 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది. వీళ్ళ మధ్య ఇంత గ్యాప్ ఉంది అని చెప్పే వరకు తెలియనంత జాగ్రత్తలు తీసుకున్న టెక్నీషియన్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -