Heroine: టాలీవుడ్ లో నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే?

Heroine: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల సెంటిమెంట్లు ఉంటాయి. ఒక హీరో లేదా హీరోయిన్ నటిస్తే సినిమా పక్క హిట్ అవుతుందన్న సెంటిమెంట్ భారీగా ఉంటాయి. ఇలాంటి సెంటిమెంట్లలో ఈ హీరోయిన్స్ సెంటిమెంట్ కూడా ఒకటని చెప్పాలి. ఈమె కనుక సినిమాలో నటించింది అంటే ఆ సినిమా పక్క హిట్ అనే సెంటిమెంట్ అందరికీ ఉంది. దీంతో ఈమెకు తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

 

ఇలా ఈ ఫోటోలో డి గ్లామర్ లుక్ లో ఉన్నటువంటి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఈమె ప్రస్తుతం తెలుగు హిందీ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె తెలుగులో రెండు సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా అవును మీరు అనుకున్నది నిజమే ఈ ఫోటోలో ఉన్నది నటి మృణాల్ ఠాకూర్.

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే కెరియర్ మొదట్లో ఈమె పలు సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా కుంకుమ భాగ్య సీరియల్ లో నటించే ప్రేక్షకులను మెప్పించారు ఇలా పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.

 

ఈ విధంగా మృణాల్ ఠాకూర్ డీ గ్లామర్ పాత్రలో నటించిన ఈ సినిమా పేరు లవ్ సోనియా. ఈ సినిమా 2014వ సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించుకొని 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొత్తం ఎక్కువగా ముంబై రెడ్ లైట్ ఏరియాలోనే షూటింగ్ పనులను జరుపుకుంది ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

 

చాలా రోజుల తర్వాత ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు బయటకు రావడంతో ఈమె ఎవరు అంటూ అందరూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నది మృణాల్ ఠాకూర్ అనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తెలుగులో ఈమె సీతారామం సినిమాతో పాటు హాయ్ నాన్న సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -