Muslim Votes: ఏపీ వార్ వన్ సైడేనా.. ముస్లిం ఓటర్ల ఓట్లు ఆశించడం వైసీపీకి అత్యాశే అవుతుందా?

Muslim Votes: ఎన్నికలు దగ్గర పడేకొద్ది ప్రతిపక్ష కూటమికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. లేటైనా లేటెస్టుగా అన్నట్టు అభ్యర్థుల ప్రకటనలో ఫినిసింగ్ స్టేజ్ లో ఉంది. వైసీపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తోంది. మొత్తం 12 జాబితాలను విడుదల చేసినా.. సగం స్థానాలపై కూడా క్లారిటీ రాలేదు. ప్రకటించిన అభ్యర్థులే ఎంత వరకు నామినేషన్ వేస్తారో కూడా తెలియదు. అలాంటి గందరగోళమైన పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది.

వైసీపీకి భిన్నంగా విపక్ష కూటమి దూసుకుపోతుంది. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి అయింది. ఒకటి అర మినహా మరెక్కడా అసమ్మతి నేతలు కనిపించడం లేదు. అటు సర్వేలు కూడా ఏకపక్షంగా టీడీపీ కూటమి గెలుపు ఖాయమని తేల్చేస్తున్నాయి. ఆ మధ్య ఇండియా టుడే సర్వేలో టీడీపీ కూటమి 17 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ప్రకటించింది. అప్పటి నుంచి ఏపీలో పొలిటికల్ ఈక్వివేషన్స్ పూర్తిగా మారిపోయాయి. బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి అదే కారణం. ఆ తర్వాతే బీజేపీ అధిష్టానం చంద్రబాబును పిలిచి పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరో సర్వేను రిలీజ్ చేసింది. మొత్తం 175 స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి 104 సీట్లను గెలుచుకుంటుంది. వైసీపీ కేవలం 49 స్థానాల్లో గెలుస్తుందని తేల్చింది. 22 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టు పోరు ఉంటుందని సర్వే ఫలితాలు తేల్చాయి. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే.. టీడీపీ, జనసేన కూటమి 18 స్థానాలు గెలుచుకుంటే.. వైసీపీ 7 స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది.

ఇప్పుడు తాజాగా మరోసర్వే కూడా టీడీపీ కూటమి గెలుపు ఖాయమని తేల్చింది. సీఓటర్ ఆధ్వర్యంలో ఏబీపీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా.. వాటిలో 20 స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంటుందని తెలిపింది. వైసీపీ 5 స్థానాలకే పరిమితమవుతుంది వెల్లడించింది. అంటే ఎన్నికలు దగ్గర పడేకొద్ది వైసీపీ దారుణమైన ఓటమికి దగ్గర పడుతోందని క్లియర్ గా తెలుస్తోంది. ఎన్ని సర్వేలు వస్తున్నా.. వైసీపీ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోసారి వైసీపీ గెలుపు ఖాయమని అంటున్నారు. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవడం ముస్లిం ఓట్లు తమకే పడతాయని విశ్లేషణలు చెబుతున్నారు.

ఏపీలో పలు నియోజకవర్గాలలో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. రాయలసీమలోని కర్నూలు, కడప, నంద్యాల, ఆదోని, హిందూపురం, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో 50 వేల నుంచి 80 వేల వరకు ఓట్లు ఉన్నాయి. అక్కడ ముస్లింలు ఎవరి వైపు ఉంటే వాళ్లే గెలుస్తారు. ఇక.. విజయవాడ వెస్ట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ఒంగోలు, చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాల నియోజవర్గాల్లో కూడా ముస్లిం ఓటర్ల 30 వేలకు పైగా ఉన్నారు. కాబ్బటి వారంతా బీజేపీపై వ్యతిరేకతతో తమకే ఓటు వేస్తారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

కానీ.. రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరేలా చెబుతున్నారు. ముస్లి మహిళలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని అంటున్నారు. తరతరాలు ట్రిపుల్ తలాక్ నుంచి ఇబ్బందిపడుతున్న ముస్లిం మహిళలను బీజేపీ సర్కార్ బయటపడేసిందని అంటున్నారు. దీంతో.. గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ముస్లింలు ఎక్కువగా శాతం బీజేపీ వైపే చేస్తున్నారని తెలుస్తోంది. ముస్లిం ఓటర్లపై నమ్మకం పెట్టుకున్న వైసీపీకి షాక్ తప్పదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -