Akhil-Nagarjuna: అఖిల్ కొరకు నాగ్ అలాంటి బట్టలు.. ఆ తప్పు వల్లే అంటూ?

Akhil-Nagarjuna: టాలీవుడ్ లో ఎంతో పేరున్న కుటుంబాల జాబితాలో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన పేరును చిరస్థాయిలో నిలిచేలా చేసుకోగా.. అక్కినేని కుటుంబం పేరును అక్కినేని వారసుడైన అక్కినేని నాగార్జున కాపాడుతున్నాడు. తెలుగు సినిమా రంగంలో ఎంతో ప్రభావం చూపించిన హీరోల జాబితాలో అక్కినేని నాగార్జున పేరు ఉంటుంది.

 

అక్కినేని నాగార్జున తనతో పాటు సినిమాలో నటించిన అమలను రెండో పెళ్లి చేసుకోవడం తెలిసిందే. చాలాకాలం పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట.. మొత్తానికి పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. అమల టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకొని ఆ కుటుంబంలో భాగమైంది. అయితే అక్కినేని నాగార్జున మరియు అమలకు అక్కినేని అఖిల్ పుట్టడం తెలిసిందే.

 

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తెలుగులో తన గుర్తింపు సాధించే క్రమంలో పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్న అక్కినేని అఖిల్ చిన్నప్పటి ఓ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అక్కినేని అఖిల్ కోసం తండ్రి నాగార్జున అమ్మాయి బట్టలు తీసుకువచ్చాడనే వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

అక్కినేని అమల గర్భవతిగా ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున ఆమెకు స్కానింగ్ చేయించాడట. అయితే అమలకు త్వరలోనే ఆడపిల్ల పుట్టబోతోందని డాక్టర్లు చెప్పారట. దీంతో నాగార్జున ఆడపిల్లల బట్టలు తెచ్చాడట. కానీ విచిత్రంగా అమలకు అఖిల్ పుట్టడంతో నాగార్జున ఒకింత నిరుత్సాహానికి గురయ్యాడట. మొత్తానికి ఆడపిల్ల పుడుతుందని ఆశగా ఉన్న నాగార్జున.. అఖిల్ పుట్టడంతో కాస్త ఫీలైనా తర్వాత మాత్రం సెట్ అయ్యాడని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -