Naga Babu: వైరల్ అవుతున్న నాగబాబు షాకింగ్ కామెంట్స్ .. ఏమైందంటే?

Naga Babu: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన సోదరుడు నాగబాబును నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబు తరచూ పార్టీ గురించి పార్టీని ప్రజలలోకి ఎలా తీసుకువెళ్లాలి అనే విషయాల గురించి చర్చలు జరపడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టే పనులలో ఉన్నారు. అయితే తాజాగా నాగబాబు జనసేనకు భారీగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.

నాగబాబు అన‌కాప‌ల్లి జిల్లా రాంబిల్లి మండ‌లం హ‌రిపురంలో ఎల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన కార్యాల‌యాన్ని నాగ‌బాబు ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభం అనంతరం నాగబాబు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాలని ఈయన సూచించారు. వచ్చే ఎన్నికలలో జనసేన టిడిపి పొత్తు పై చర్చలు వద్దని తెలిపారు.

 

జనసేన పార్టీ నుంచి ఎవరు ఎన్నికల బరిలోకి దిగుతారు వారిని గెలిపించడమే ధ్యేయంగా ముందుకు నడవాలని నాగబాబు సూచించారు.గత ఎన్నికలలో జనసేన పార్టీకి కేవలం ఏడు శాతం మాత్రమే ఓట్లు రాగా ప్రస్తుతం మాత్రం 35% ఓటు బ్యాంకు ఉందని నాగబాబు కామెంట్ చేశారు.ఇలా నాగబాబు జనసేనకు 35% ఓట్లు పెరిగాయి అని చెప్పడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు చిల్లపడటం ఖాయమని పలువురు భావిస్తున్నారు.

 

ఈ విధంగా జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు పెరిగితే కనక ఒంటరిగా ఎన్నికల బరిలో దిగవచ్చు.పొత్తుల కోసం పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదని టిడిపితో ఏమాత్రం పొత్తు కుదుర్చుకోవాల్సిన పనిలేదని పలువురు నాగబాబు వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే నాగబాబు వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఇరుకున పడేసేలా ఉన్నాయి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.ఒకవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది అంటూ ఆయన చెబుతుండగా నాగబాబు మాత్రం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే అంటూ పదేపదే ప్రస్తావిస్తుండడంతో దీని వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -