Naga Chaitanya: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది: నాగచైతన్య

Naga Chaitanya: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయి దాదాపు కొన్ని నెలలు కావస్తున్నా కూడా వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే వీరి విడాకులకు గల అసలు కారణం ఏంటి అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించిన విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే విడాకుల తర్వాత సమంత, నాగచైతన్యలకు ఎక్కడికి వెళ్లినా కూడా అదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి ఈ ఇద్దరు వాటిని దాటేస్తూ వచ్చారు.

అయితే అప్పుడు విరాకులపై స్పందించని నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చై మాట్లాడుతూ.. సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని తెలిపాడు. ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి అడుగుతూ విడాకుల గురించి కాకుండా కొత్తగా సమంతా పై మీ అభిప్రాయం ఏంటి అని సదరు యాంకర్ అడగగా ఆ విషయంపై స్పందించిన నాగచైతన్య.. సమంత అంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది..తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు.. ఒక అండర్‌స్టాండింగ్‌ తోనే మేము విడాకులు తీసుకొని ఓడిపోయాం. ఆ సమయంలో కూడా మాకు ఒకరిపై మరోకరికి మంచి రెస్పెక్ట్‌ ఉంది.

మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాము. అంతే కానీ అంతకుమించింది మా మధ్య ఏదో జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కానీ విడాకుల తీసుకున్న తరువాత ప్రారంభంలో మాత్రం మాపై వచ్చిన వార్తలు చూసి చాలా విసుగు చెందాను అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. అయితే విడాకుల తరువాత సమంత గురించి నాగచైతన్యకు ఎటువంటి ప్రశ్న ఎదురైనా నాగ చైతన్య మాత్రం సమంత గురించి గొప్పగానే చెబుతూ వచ్చాడు. కానీ సమంత మాత్రం కనీసం నాగచైతన్య పేరు పలకడానికి కూడా ఇష్టపడడం లేదు. కాగా ఇదే విషయం పై ఇటీవలే నాగచైతన్య అభిమానులు ఆమె పై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -