Varasudu: అప్పట్లో నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య జరిగిన రచ్చ.. ఇంతకు ఏం జరిగిందంటే?

Varasudu: టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాగ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక స్టార్ హీరోగా కూడా టాలీవుడ్ లో తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. నాగార్జున లో గొప్పతనం ఏమిటంటే.. ఇప్పటికీ తనకి ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ చెక్కుచెదరని అందం తన సొంతం.

ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా వరుస సీనియర్ అవకాశాలు అందుకుంటూ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి అతని నటన గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో కృష్ణ గారు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి గట్టిగా తనకంటూ చరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి లెజెండ్లతో కృష్ణ గారు సినీ ఇండస్ట్రీలో హీరోగా పోటీపడుతూ అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు.

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో నాగార్జున కృష్ణ అభిమానుల మధ్య ఒక విషయంలో భారీ ఎత్తున రచ్చ జరిగింది. అదేమిటంటే 1993లో ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన వారసుడు సినిమా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే ఆ సినిమా సమయంలో కృష్ణ గారు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నారు. అయినప్పటికీ నాగార్జునకు తండ్రిగా నటించడానికి ఒప్పుకున్నారు.

ఇక ఇద్దరి స్టార్ కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా కాబట్టి అప్పట్లో ఈ సినిమా గురించి భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఎక్కడా తగ్గకుండా సినిమా విడుదల రోజున థియేటర్ల ముందు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి ఎవరికి వారు ఏమాత్రం తగ్గుకుండా రచ్చ రచ్చ చేశారు. ఆఖరికి తమ హీరోలకు దండలు వేసే విషయంలో కూడా భారీ కూడా పెద్ద ఎత్తున పోటీపడి భారీ స్థాయిలో దండలను తమ హీరోల పోస్టర్లకు వేశారు. అలా 1993లో వారసుడు సినిమాకి నాగ్- కృష్ణ గారి అభిమానుల మధ్య భారీ ఎత్తున రచ్చ జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -