Nagarjuna: సీపీఐ నారాయణ కు నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమన్నాడంటే?

Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు మన్మధుడు నాగార్జున పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించి తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక దాదాపు ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం. కుర్ర హీరోలతో సమానంగా నాగార్జున సినీ అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ఇటీవల వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగార్జున హీరోగా తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించాడో మనందరికీ తెలిసిందే. ఈ విధంగా నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో లో హోస్ట్ గా చేస్తున్నాడు. సాధారణంగా నాగార్జున పై చాలా విమర్శలు వస్తాయి. కానీ నాగార్జున అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు.

ఇక బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నప్పటి నుంచి నాగార్జున పై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. కానీ నాగార్జున వాటిని కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతాడు. మరి ఇటీవల సీపీఐ నేత నారాయణ గ్యాప్ లేకుండా బిగ్ బాస్ షోపై, నాగార్జున పై పలు రకాల విమర్శలు చేస్తున్నాడు. బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటూ నాగార్జునను దెప్పి పొడుస్తున్నాడు. ఇక బిగ్ బాస్ షో వల్ల మంచి వాళ్ళు చెడిపోవడం తప్ప మరి ఏం లాభం లేదు అని నారాయణ విమర్శలు చేస్తున్నాడు.

ఇక విమర్శలు చేస్తున్న నారాయణకు నాగ్ ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు. తాజాగా శనివారం కు సంబంధించిన ఎపిసోడ్ లో.. నాగార్జున హౌస్ లో ఉన్న కపుల్స్ రోహిత్, మెరీనా ను పిలిచాడు. ఇక.. ఇద్దరినీ టైట్ గా హగ్ చేసుకోమని అన్నాడు. మీకు లైసెన్స్ ఉంది. మీరిద్దరూ భార్యాభర్తలు కౌగిలించుకోవడం తప్పు కాదంటూ.. నారాయణ నారాయణ అంటూ అంటూ ఇన్ డైరెక్ట్ గా నాగార్జున సీపీఐ నారాయణ కు కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -