Nagarjuna: సినిమా రివ్యూల విషయంలో ఆ విధంగా స్పందించిన నాగార్జున!

Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు అగ్రస్టార్ హీరో నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం.

కుర్ర హీరోలతో సమానంగా నాగార్జున ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినీ అవకాశాలను తన సొంతం చేసుకుంటున్నాడు. ఇక నాగార్జున ఇండస్ట్రీలోనే కాకుండా పలు బిజినెస్ రంగాల్లో కూడా ముందుంటున్నాడు. ఇలా బిజినెస్ రంగం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ గా కూడా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ఇక గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.

ఇదిలా ఉంటే నాగార్జున ఇటీవల సినిమా రివ్యూల గురించి స్పందించారు. నిజానికి సినిమా రివ్యూలు కీలకపాత్ర వహిస్తాయి. అదేవిధంగా చాలామంది ప్రేక్షకులు సినిమా రివ్యూ ని బట్టి ఆ సినిమా ను గురించి జడ్జ్ చేస్తారు. కానీ చాలామంది సినిమా రివ్యూలు సినిమా ని డిసైడ్ చేయలేవని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ నాగార్జున మాత్రం సినిమా రివ్యూలు కీలకపాత్ర వహిస్తాయని తెలిపాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున సినిమా రివ్యూల గురించి స్పందించాడు.

అప్పట్లో రివ్యూ లో పేపర్ రూపంలో వారానికి వచ్చేవి. అప్పటికి సినిమా ఉంటుందో లేదో కూడా తెలిసేది కాదు. కనుక రివ్యూలు ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం సినిమా టాక్ లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని నాగార్జున తెలిపాడు. ఇక నేను కూడా సినిమాలు వెబ్ సిరీస్ లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తానని నాగార్జున తెలిపాడు. అంతేకాకుండా కనీసం 7 రేటింగ్ ఉంటేనే ఆ సినిమా చూస్తాను అని నాగార్జున వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -