Nagarjuna: అన్ని కోట్ల ఆస్తి నెత్తిన తగలేసుకోడానికా..? నాగార్జున కోపం వెనుక అసలు కథ ఇదేనా?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన మరోవైపు నా సామిరంగా అనే సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఇలా ఈ వయసులో కూడా నాగార్జున కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య అఖిల్ ప్రేక్షకుల ముందుకు హీరోలుగా వచ్చారు. అయితే నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ అఖిల్ మాత్రం వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు.

ఇక సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అఖిల్ కూడా శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోని బ్రేకప్ చెప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే గతంలో ఒక కార్యక్రమంలో భాగంగా నాగార్జున చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన గతంలో మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం అంటూ చెప్పుకు వచ్చారు.

ప్రతి మనిషికి తోడు అనేది ఎంతో అవసరం మనం బాధలో ఉన్నా కష్టంలో ఉన్న సంతోషంలో ఉన్న వాటిని పంచుకోవడానికి మరో వ్యక్తి ఎంతో అవసరం. ఇలా మన బాధ సంతోషాలని ఇతరులతో పంచుకున్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని, మనకోసం ఒక మనిషి పక్కన లేకపోతే ఎంత ఆస్తి ఉన్న తగలేసుకోవడానికి తప్పిస్తే దేనికి పనికిరాదు అడ్డు ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ తన కుమారులకి బాగా సెట్ అవుతాయని, పలువురు నాగార్జున కామెంట్స్ ఆయనకి సూట్ అవుతాయని తన కొడుకులకు ఇప్పటికీ పెళ్లిళ్లు కాకుండా ఒంటరిగానే ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -