Nagarjuna: అక్కినేని నాగార్జున పిసినారితనానికి నిదర్శనమిదే.. ఏఎన్నార్ ఈవెంట్ లో అలా చేశారా?

Nagarjuna: సాధారణ ప్రజలకి సెలబ్రిటీస్ అంటే ఒక రకమైన ఆరాధన. వాళ్ల లైఫ్ స్టైల్ కి ఫిదా అయిపోతారు జనాలు. నచ్చిన తిండి తింటూ, నచ్చిన బట్టలు కట్టుకుంటూ, నచ్చిన లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తారు. స్వర్గం అంతా వాళ్ళ కాళ్ళ ముందే ఉంటుంది అనుకుంటారు. అలాంటి లైఫ్ తాము కూడా లీడ్ చేయాలి అనుకుంటారు. అయితే అందరూ స్టార్స్ అలా ఉండరు. ఎందుకంటే కష్టాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళు తమ కష్టాన్ని వృధాగా పోనివ్వరు.అలాగే విచ్చలవిడితనాన్ని కూడా ప్రదర్శించరు.

ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇంకెవరు కింగ్ నాగార్జున గురించి. మొన్న జరిగిన ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ సభలో తను వేసుకున్న షర్ట్ తో ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయాడు నాగార్జున. అసలు సంగతి ఏమిటంటే విగ్రహావిష్కరణ ఫంక్షన్ కి వచ్చిన స్టార్స్ అందరూ తమ తమ స్టైల్ ప్రతిబింబించేలా డిఫరెంట్ లుక్స్ తో, కాస్ట్లీ కాస్ట్యూమ్స్ తో అదరగొట్టేసారు. అయితే కింగ్ నాగార్జున మాత్రం చాలా సింపుల్ లుక్ తో కంఫర్ట్ గా కనిపించాడు.

అతను వేసుకున్న షర్టు నాగార్జునకి సింపుల్ అండ్ జెంటిల్మెన్ లుక్ ఇచ్చింది. అయితే అది చూసి కామ్ గా ఊరుకుంటే ఎలా.. అందుకే ఆ షర్ట్ గురించి ఆరాలు తీరం మొదలుపెట్టారు మన నెటిజన్స్. అయితే ఆ షర్టు కొత్తది కాదంట బిగ్ బాస్ 5 లో ఒక వీకెండ్ లో నాగార్జున ఈ షర్టు కనిపించాడంట. ఈ షర్ట్ కాస్ట్ 84,000 రూపాయలు. అయితే ఇది పాత షర్ట్ అని తెలుసుకున్న ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు.

ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకొని ఒక కొత్త షర్ట్ కొనుక్కోవచ్చు కదా, అక్కినేని నాగార్జున ఇంత పిసినారా అంటూ ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున ని వెనకేసుకొస్తున్నారు. అతనికి డబ్బు విలువ తెలుసు, అనవసరమైన ఆర్భాటాలకి పోడు అంటూ నాగార్జునకి కితాబు ఇస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జున సింపుల్ సిటీకి మెచ్చుకోవాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -