Chandrababu Naidu – Nara Lokesh : బాబు కొత్త ఫార్ములా.. లోకేష్ సీటు గల్లంతేనా?

గత ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే గెలుచుకుని ఘోర పరాజయం పాలైన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో జగన్ కు చెక్ పెట్టేందుకు సిద్దమవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. ఇప్పుడే తమ వ్యూహలకు పదును పెట్టింది. జగన్ ను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా బీజేపీని దగ్గర చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు ఉంటే సలువుగా జగన్ ను ఓడించవచ్చని టీడీపీ భావిస్తోంది. ఆ దిశగా చంద్రబాబు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించి బీజేపీని మచ్చిక చేసుకుంటున్నారు. ప్రతి విషయంలో ఆ పార్టీ పట్ట సానుకూలంగా ఉంటున్నారు.

ఇక జనసేన పట్ల కూడా టీడీపీ మెతక వైఖరి అవలంభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 2014 ఎన్నికల తరహాలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంపై చంద్రబాబు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలకు టికెట్లపై ఇప్పటినుంచే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అయితే టీడీపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ కు చెక్ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఒక ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే సీటు అనే ఫార్ములాను తెరపైకి తెచ్చారు. చాలా జిల్లాల్లో ఒక కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు టీడీపీలో కొనసాగుతున్నారు. తమ ఫ్యామిలీలోని అందరికీ సీట్లు ఇవ్వాని కోరుతున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికే మాత్రమే సీటు ఇచ్చేలా టీడీపీ కొత్త కండీషన్ అమల్లోకి తెచ్చే ఆలోచనలో ఉంది. ఈ కండీషన్ ను అమల్లోకి తెస్తే చంద్రబాబు ఫ్యామిలీ కూడా పాటించక తప్పని పరిస్థితి ఉంటుంది.

అప్పుడు చంద్రబాబు పోటీలోకి దిగి నారా లోకేష్ ను పోటీ నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే రూల్ పెడితే అది చంద్రబాబు ఫ్యామిలీ పాటిస్తుందా? చంద్రబాబు పోటీలోకి దిగి నారా లోకేష్ ను పోటీ నుంచి తప్పించి పార్టీ వ్యవహారాలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలోనే ఇతర నేతలకు ఆ నిబంధన వర్తింపజేయాలంటే చంద్రబాబు ఫ్యామిలీ కూడా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మిగతా నేతలు కూడా ఆ రూల్ ను పాటిస్తారు. చంద్రబాబు ఇలాంటి విషయాలు సీరియస్ గా ఉంటారు కనుక.. ఆ నిబంధనను తీసుకొస్తే లోకేష్ ను తప్పిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి పాలయ్యారు. అయినా మంగళగిరి నియోజకవర్గాన్ని వదులుకోకుండా అక్కడ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా మంగళగిరి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని వదులుకునే పరిస్థితుల్లో నారా లోకేష్ లేరనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ పొగోట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్నట్లు.. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలనే ప్రయత్నాల్లో లోకేష్ ఉన్నారు. ఒక వేళ ఒకే కుటుంబానికి ఒకే సీటు అనే నియమం పెడితే లోకేష్ సీటుకు ఎర్త్ పడుతుందా? లేదా? అనేది చూడాలి

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -