Netherlands: అమెరికాను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన డచ్ టీమ్

Netherlands: ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన డచ్ టీమ్ నెదర్లాండ్స్ ఖతార్‌లో జరుగుతున్న ప్రస్తుత వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలో అంచనాలను అందుకోలేకపోయింది. అయితే చిన్న టీమ్‌లపై సాధారణ ప్రదర్శన చేసి నాకౌట్‌కు చేరుకున్న నెదర్లాండ్స్ జట్టు ఎట్టకేలకు జూలు విదిల్చింది. శనివారం ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తన సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ హీరో డంఫ్రీస్ అని చెప్పాలి. ఈ జట్టు సాధించిన మూడు గోల్స్‌లోనూ అతడి భాగస్వామ్యం ఉంది. డంఫ్రీస్ స్వయంగా ఒక గోల్ కొట్టడమే కాకుండా మిగతా రెండు గోల్స్‌లోనూ తన సహకారం అందించాడు. అయితే గ్రూప్ దశలో చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్న అమెరికా ప్రి క్వార్టర్ ఫైనల్లో డచ్ జట్టు ముందు తేలిపోయింది.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత గోల్ చేసే అవకాశం వచ్చింది మాత్రం అమెరికాకే. మూడో నిమిషంలోనే ఆ జట్టు ఆటగాడు పులిసిచ్ గోల్ కోసం గట్టి ప్రయత్నం చేశాడు. కానీ నెదర్లాండ్స్ గోల్ కీపర్ నొపెర్ట్ అమెరికా గోల్‌ను సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. 10వ నిమిషంలో చక్కటి పాసింగ్‌తో గోల్ అవకాశాన్ని సృష్టించుకున్న డచ్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 46వ నిమిషంలో ఆ జట్టు రెండో గోల్ కొట్టింది. అయితే తొలి హాఫ్ ముగిసే వరకు రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

సెకండాఫ్‌లో డచ్ టీమ్ దూకుడు
సెకండాఫ్‌లో 76వ నిమిషంలో అమెరికా ఆటగాడు హాజి రైట్ గోల్ కొట్టడంతో నెదర్లాండ్స్ ఆధిక్యాన్ని 1-2కి తగ్గించింది. అయితే అమెరికా ఇదే దూకుడు కొనసాగించి స్కోరును సమం చేస్తుందని అభిమానులు భావిస్తున్న సమయంలో డచ్ టీమ్ మరో గోల్ కొట్టడంతో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత అమెరికా గట్టిగా ప్రయత్నించినా గోల్ మాత్రం చేయలేకపోయింది. కాగా నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ చేరడం ఫిఫా చరిత్రలో ఇది ఏడోసారి కావడం గమనించాల్సిన విషయం.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -