Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన రతిక.. స్పెషల్ పవర్ తో ఆ కంటెస్టెంట్ ను సేవ్ చేసిందిగా!

Bigg Boss 7 Telugu:తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్తరంగా సాగుతోంది. చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. గత వారం 5 మంది కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు నయనీ పావని.

అలాగే మొదటి 5 వారాల్లో, మూడు వారాలు పైగా కొనసాగిన శుభ శ్రీ, రతికా, దామిని లలో ఎవరో ఒకరు ఇంటి సభ్యుల ఓట్లని ఆధారంగా తీసుకొని హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని హౌస్ లోపలకు అడుగుపెట్టబోతుంది. అలా హౌస్ లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ రతికా. ఆమెనే అతి త్వరలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అయితే హౌస్ లో ఆమె మామూలుగా మాత్రం ఎంటర్ అవ్వడం లేదని టాక్.

బిగ్ బాస్ ఒకరిని బయటకి వెంటనే పంపే పవర్, అలాగే నామినేషన్స్ నుండి ఒకరిని తప్పించే పవర్ ఇస్తున్నట్టు సమాచారం. రతికా గౌతమ్ ని నామినేషన్స్ నుండి సేవ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఈరోజు హౌస్ లోకి అడుగుపెట్టబోతుందా, లేదా శనివారం రోజు రాబోతోందా అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ కెమెరాలకు కావాల్సినంత కంటెంట్ ఇస్తూ వచ్చే రతికా, ఈసారి ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నప్పుడు కనీసం ప్రశాంత్ ముఖం వైపు కూడా చూడలేదు. మరి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతనితో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -