Sandeep Master: శివాజీ గుట్టు రట్టు చేసిన సందీప్.. ఆయన నిజస్వరూపం మాత్రం ఇదేనంటూ?

Sandeep Master: బిగ్ బాస్ స్టేజిపై సందీప్ తన తోటి కంటెస్టెంట్స్ గురించి చాలా బాగా మాట్లాడారు. కానీ హౌస్ నుంచి బయటికి వచ్చేసరికి అతని వెర్షన్ మారిపోయింది. నిజానికి బిగ్ బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయిన ఆట సందీప్ పేరుతో చాలా రికార్డులే ఉన్నాయి. 8 వారాలపాటు నామినేషన్ లోకి రాకుండా ఉన్న తొలి కంటెస్టెంట్ అతనే, అంతేకాకుండా తొలి హౌస్ మేటుగా 5 వారాలు ఇమ్యూనిటీ పొందిన కంటెస్టెంట్ కూడా ఆట సందీప్ మాత్రమే. అయితే ఉల్టా పల్టా కాన్సెప్ట్ అనూహ్యంగా నామినేట్ అయిపోయారు ఆట సందీప్.

బయటికి వచ్చిన సందీప్ ఇంటర్వ్యూలు ఇస్తూ హౌస్ మేట్స్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సందీప్ మాట్లాడుతూ శివాజీ, అర్జున్ అంబటి లను ఏకిపారేశారు. అలాగే 60 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంటే చిన్న విషయం కాదు నేను హ్యాపీగానే ఉన్నాను. టైటిల్ కొట్టాలనే వెళ్ళాను కానీ అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా, నేను నామినేషన్స్ లోకి రాకపోవడం, ఫస్ట్ నామినేషన్ లోకి రావటం కూడా నా ఎలిమినేషన్ కి కారణం.

5 వారాలు ఇమ్యూనిటీ రావడం గౌతం సేవ్ చేయడం నేను నామినేషన్ లోకి రాకపోవడానికి కారణం. నేను డాన్స్ షోలో సీరియస్ గా ఉంటానని గొడవలు పడతానని, బిగ్ బాస్ హౌస్ లో సేఫ్ గేమ్ ఆడానని అనటంలో నిజం లేదు. నేను ఇంట్లో ఎలా ఉంటానో బిగ్ బాస్ లో కూడా అలాగే ఉన్నాను కొన్ని గేమ్స్ అమర్ ఇచ్చిన తుంటరి ఆలోచనల వల్ల అలా చేయాల్సి వచ్చింది.

అమర్ కి నాకన్నా బిగ్ బాస్ గురించి బాగా తెలుసు అనుకొని అతను చెప్పినట్లు చేశాను అదే మిస్టేక్ అయింది . అలాగే శివాజీ గురించి నన్ను ఒక ఫేక్ రీసన్ తో కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించారు. శివన్న తేనె పూసిన కత్తిలాగ మాట్లాడారు. 8 వారాలు ఆటలో శివాజీ మొదటి రెండు వారాలు తప్పితే మిగిలిన ఆరువారాలు అసలు ఏం ఆడారు అంటూ ఏకి పారేసాడు. అలాగే టాప్ త్రీ లో ప్రశాంత్, అమర్, ప్రియాంక మాత్రమే ఉంటారు అని చెప్పాడు సందీప్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -