Anasuya: అనసూయను మళ్లీ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు.. ఏమైందంటే?

Anasuya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం షోలు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. అలాగే పలు వివాదాల్లోనూ తలదూరుస్తూ.. విమర్శలకు కారణమవుతోంది. దీంతో నెటిజన్లు అనసూయను భారీగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా అనసూయ.. సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. సుధీర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దీంతో సుధీర్ ఫ్యాన్ అనసూయను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

 

ఇంతకీ అనసూయ.. సుధీర్‌పై చేసిన వ్యాఖ్యలేంటని అనుకుంటున్నారా? అదేంటంటే.. సుధీర్-అనసూయ కలిసి ఇటీవల ‘సూపర్ సింగర్ జూనియర్’ షోకి హోస్టులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ యాంకర్.. ‘సుధీర్‌తో కలిసి పని చేయడం ఎలా ఉంది?’ అని అనసూయను ప్రశ్నించింది. దానికి అనసూయ.. ‘సుధీర్‌తో కొత్తగా కలిసి పని చేయడం లేదు. జబర్దస్త్ నుంచే పరిచయం. తను నా జూనియర్. ఆ విషయం మీక్కూడా తెలుసు. కెరీర్ పరంగా సుధీర్ నా దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. నేనూ సుధీర్ నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నా.’ అని చెప్పింది. అయితే అనసూయ సుధీర్ గురించి రాష్‌గా మాట్లాడటం.. సుధీర్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

 

 

రెండు మంచి సినిమాల్లో నటించగానే అనసూయ యాటిట్యూడ్ చూపిస్తోందని ఆరోపిస్తున్నారు. మళ్లీ తెరపై ‘ఆంటీ’ మ్యాటర్‌ను తీసుకొచ్చారు. సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలొయింగ్ అనసూయకు ఉండదని, ఆయన గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. దీంతో నెట్టింట మళ్లీ ఘోరంగా ట్రోలింగ్ బారిన పడింది అనసూయ. అయితే ఈ విషయంపై అనసూయ ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి. కాగా, జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -