Anasuya: దానికి శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్‌ అవ్వాలి.. అనసూయ చెప్పుతో కొట్టినట్టు ఇచ్చేసిందిగా!

Anasuya:  ఫైర్ బ్రాండ్ అనసూయ తనపై వచ్చిన నెగటివ్ కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోదు. అన్ని కామెంట్స్ ని కూడా నెగ్లెట్ చేయదు తనని హార్ట్ చేసిన కామెంట్ కి తనదైన స్టైల్ లో రిప్లై ఇస్తుంది. అలా చేయడంలో తను ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది. ప్రస్తుతం అలాగే తన మీద వచ్చిన ఒక నెగటివ్ కామెంట్ కి తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చి ట్రెండింగ్ లోకి వచ్చింది అనసూయ.

ఇంతకీ ఏం జరిగిందంటే రీసెంట్గా జీ తెలుగు ఈవెంట్ లో కొందరి హీరోయిన్స్ కి ట్రిబ్యూట్ ఇచ్చింది అనసూయ. ఈ పెర్ఫార్మెన్స్ తాలూకా ప్రోమోనీ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనసూయ అభిమానులు ఈ ప్రమో చాలా బాగా నచ్చేసింది. మరీ ముఖ్యంగా మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీదేవి, జమున లను ఇమిటేట్ చేయటం అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. అయితే కావాలనే కొందరు అనసూయని ట్రోల్ చేస్తున్నారు.

సావిత్రి గారిలాగా నటించడం మీ వల్ల కాదు. ఎక్స్పోజింగ్ చేసినంత ఈజీ అనుకున్నావా అంటూ ఘాటుగా స్పందించారు. దీనిపై తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది అనసూయ. నిజమేనండి మీరు చెప్పింది కరెక్టే, సావిత్రి గారి లాగా నటించడం ఎవరి తరం కాదు. నేను జస్ట్ ట్రిబ్యూట్ ఇచ్చాను అంతే అలా అని ఎక్స్పోజింగ్ చేయడం కూడా అంత తేలిక కాదు శారీరకంగా, మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి.

ఏ పాత్ర చేసినా ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి అంటూ రాసుకొచ్చింది అనసూయ. దీనితో అనసూయని సపోర్ట్ చేసే అభిమానులు చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పారు అంటూ అప్రిషియేట్ చేశారు. కొందరు మాత్రం నిన్ను నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్ అంటూ విమర్శించారు. ఈ పొగడ్తలు, విమర్శలు ఎప్పుడూ ఉండేదే కానీ అనసూయ ఇచ్చిన రిప్లై మాత్రం ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -