Anasuya: అనసూయ ఒంటిమీద ఉన్న టాటూలు ఇవే.. ఆ టాటూల వెనుక అర్థం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Anasuya: అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. అనసూయ యాంకరింగ్ లో కొత్త పోకడలు తీసుకువచ్చింది అంటూ స్టార్ యాంకర్ సుమ సైతం ఆమెని పొగిడేసింది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఈ యాంకర్ ఆ తర్వాత స్టార్ యాంకర్ గా రూపాంతరం చెంది తర్వాత వెండితెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది. రంగస్థలం సినిమాతో ఆమె రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత యాంకరింగ్ చేయలేనంత బిజీగా మారిపోయింది అనసూయ. ఈమె తన అందాలను సైతం ఆరబోయటంలో ఏమాత్రం వెనుకంజ వేయదు, అలా అని ఎవరైనా కామెంట్ చేస్తే అసలు ఊరుకోదు. అయితే ఆమె తాజాగా పెదకాపు సినిమాలో నటించిన అక్కమ్మ పాత్ర ఆమెకి ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టింది. 2018లో రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఎంత మంచి పేరు తెచ్చి పెట్టిందో ఇప్పుడు ఈ పాత్ర కూడా అంతే మంచి పేరు తెచ్చి పెట్టింది.

అయితే రీసెంట్ గా కార్ లో నైట్ షూట్ కి వెళ్తున్న అనసూయ లోకేషన్ కి చేరుకోవడానికి 40 నిమిషాల టైం ఉండటంతో అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాళ్ళని ఖుషి చేసింది. అందులో భాగంగా ఒక అభిమాని మీకు ఎన్ని టాటూస్ ఉన్నాయి వాటి అర్ధాలు ఏమిటి అని అడిగాడు. అయితే అనసూయ కూడా అంతే ఫ్రాంక్ గా సమాధానం చెప్పింది.

నా ఒంటి మీద రెండు టాటూస్ ఉన్నాయి. మొదటిది నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ అండ్ నా భర్త పుట్టినరోజు రెండు ఒకేసారి కలిసి రావడంతో నా భర్త ముద్దు పేరు అయిన నిక్కు అనే పేరు ఉంటుంది. రెండవది కేలన్. గ్రీకు భాషలో క్యారెక్టర్ బ్యూటీ అని చెప్పుకొచ్చింది ఈ భామ. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనికి పైగా సినిమాలు ఉన్నాయి. అలాగే వెబ్ సిరీస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -