Anasuya: అమ్మమ్మ పాత్రల్లో నటించడానికి కూడా సిద్ధమే.. అనసూయ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Anasuya: అఖండ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్ గా, శ్రీకాంత్ అడ్డాల దర్శకుడుగా పెదకాపు అనే మూవీ సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారు. పెదకాపు పార్ట్ వన్ ఈనెల 29న విడుదలవుతుంది. అయితే ఈ సినిమాలో హీరోగా సినిమా ప్రొడ్యూసర్ అయిన మిరియాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రని పోషించారు.

ఆమె తను పోషించిన పాత్ర గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. పెద కాపు సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా వరల్డ్ తో కచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. సినిమాలో నాది చాలా పవర్ఫుల్ పాత్ర. ఇందులో నా పేరు కూడా నాకు కొత్తగా అనిపించింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు, అలాగే విమానం సినిమాలో సుమతీ పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెద్దకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా ఉంటుంది.

ఇందులో బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు రంగమ్మత్తగా నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాత్ర పేరుతోనే నన్ను పిలుస్తారు. ఇలానే నేను విభినమైన పాత్రలో చేయటానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. అవసరం అనుకుంటే నేను అమ్మమ్మ పాత్ర కూడా పోషించడానికి సిద్ధం. కాకపోతే సినిమా చూసినవారు అమ్మమ్మ గురించి మాత్రమే మాట్లాడుకునేంత బలమైనదిగా ఆ పాత్ర ఉండాలి అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ.

అలాగే ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు అని తెలుసు కానీ ఆయన కూడా నటిస్తున్నారని తెలియదు. నిజానికి ప్రతి దర్శకుడులోని ఒక నటుడు ఉంటాడు. అందుకే నటీనటులకి ఎలా చేయాలో చెప్పగలుగుతాడు. అలాగే శ్రీకాంత్ కూడా చాలా సులభంగా ఈ పాత్రని చేశారు.ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక మేకవర్ ఉంది. అలాగే నా పాత్ర ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ సినిమా నాకు చాలా మంచి అనుభవం అని చెప్పుకొచ్చింది అనసూయ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -