SIS Survey: ఏపీలో పొత్తులపై సంచలన సర్వే.. టీడీపీ-జనసేన కలిస్తే ఎన్ని సీట్లంటే?

SIS Survey: ఏపీలో పొత్తులపై ఇప్పటినుంచే చర్చ జరుగుతోంది. ఇప్పుడు పొత్తులు పొడుస్తున్నాయి. పొత్తుల గురించి ఇప్పటినుంచే పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. ఏకడతాపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఓట్లు చీలితే అధికార వైసీపీకి కలిసొచ్చే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రతిపక్షాల మధ్య చీలిపోవడం వల్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసన మధ్య చీలిపోతుంది. దీంతో గత ఎన్నికల్లో టీడీపీకి ఇదే దెబ్బ కొట్టింది. వైసీపీ వ్యతిరేక ఓటు జనసేనకు కొంత వెళ్లడం వల్ల టీడీపీ నేతలు చాలాచోట్ల చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు.

అందుకే టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం, జగన్ ను ఎదుర్కొనేందుకు ఎవరితోనైనా కలిసేందుకు సిద్దమని ప్రకటించారు. మిగతావారు కూడా దిగివరాలని కోరుతున్నారు. చంద్రబాబు కూడా తగ్గాలని పవన్ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు కూడా రాష్ట్రం కోసం ఎవరితోనైనా కలిసేందుకు సిద్దమని గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

అయితే బీజేపీ మాత్రం కలిసిసొస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. బీజేపీ కలిసి రాకపోయినా టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన సిద్దమవుతోంది. కానీ బీజేపీకి రాష్ట్రంలో బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలోకి ఉంది. బీజేపీ అండ ఉంటే రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కొవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎన్డీయేలో చేరేందుకు టీడీపీ సిద్దమవుతుందనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఎన్డీయేలో టీడీపీ చేరబోతుందనే టాక్ జాతీయ మీడియాలో జరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ క్రమంలో ఏపీలోని పొత్తులపై ఎస్ఐఎస్ సర్వే ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. లక్షా 30 వేల 700 శాంపిల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే ఏజెన్సీ సేకరించింది. టీడీపీ,జనసేనతో పాటు టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ప్రజలు అభిప్రాయాలను క్రోడీకరించి ఓ రిపోర్టును ఎస్ఐఎస్ సర్వే ఏజెన్సీ విడుదల చేసింది. ఇందులో టీడీపీ, జనసేన పొత్తు ఉంటే మద్దతు ఇస్తారా అని ప్రశ్న అడగగా.. 55 శాతం మంది మద్దతు ఇస్తామని తెలిపారు.

ఇక 35 శాతం మంది టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ఇవ్వమని తేల్చిెప్పారు. ఇక 5 శాతం మంది ఏం చెప్పలేమని తెలిపారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇందులో 56 శాతం మంది టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మూడు పార్టీలు కలిస్తే మద్దతు ఇవ్వమని చెప్పారు. ఇక 30 శాతం మంది ఆ మూడు పార్టీల పొత్తుకు మద్దతు ఇస్తామని తేల్చిచెప్పారు. ఇక 14 శాత మంది ఏం చెప్పలేమని స్పష్టం చేశారు.

ఇక బీజేపీ-జనేసేన పొత్తుపై సర్వే నిర్వహించారు. బీజేపీ, జనసేన పొత్తుకు మద్దతు ఇవ్వమని 55 శాతం మంది ప్రజలు చెప్పారు. 35 శాతం మంది మద్దతు ఇస్తామని చెుప్పగా.. 10 శాతం మంది ప్రజలు ఏం చెప్పలేమని తేల్చిచెప్పారు. ఇక ఎలాంటి పొత్తులు లేకుండా టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ప్రజల అభిప్రాయాలను ఆ సర్వే సంస్ధ తీసుకుంది. ఇందులో 48 శాతం మంది మద్దతు ఇస్తామని, 42 శాతం మంది మద్దతు ఇవ్వమని చెప్పారు. ఇక 10 శాతం మంది ఏం చెప్పలేమని తేల్చిచెప్పారు.

ఇక టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అభిప్రాయలను కోరగా.. 67 శాతం మంది మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక 26 శాతం మంది మద్దతు ఇవ్వమని, 7 శాతం మంది ఏం చెప్పలేమని చెప్పారు. ప్రజల అభిప్రయాలను చూస్తే బీజేపీతో పొత్తును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల మద్దతు ఇవ్వడం లేదు. టీడీపీ,జనసేన , ఇతర వామపక్ష పార్టీల మద్దతుకు ప్రజలు ానుకూలంగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -