Niharika: విడాకుల తర్వాత వాళ్లతో పార్టీ చేసుకుంటున్న నిహరిక.. ఏమైందంటే?

Niharika: మెగా ప్రిన్సెస్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది ఈ భామ. అలాగే గత కొన్ని రోజులుగా ఆమె భర్త చైతన్యతో దూరంగా ఉంటూ సోషల్ మీడియా కి కావాల్సినంత న్యూస్ ఇస్తుంది. ఈమె 2020లో జొన్నలగడ్డ చైతన్యను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య చాలా రోజుల నుంచి సత్సంబంధాలు లేవు. విడాకులు తీసుకుంటున్నారు అంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఎంతో ఘనంగా జరిగిన నిహారిక పెళ్లి మెమోరీస్ నుంచి బయటికి రాకముందే విడాకులు తీసుకొని అందరిని విషాదంలో ముంచారు నిహారిక దంపతులు. అయితే వాళ్ళు ఎప్పటినుంచో విడివిడిగానే ఉంటున్నారు. దీంతో నిహారిక కూకట్ పల్లి కోర్టులో విడాకులకి అప్లై చేయగా జూలై 5న మంజూరయ్యాయి ఈ విషయాన్ని ఇటు నిహారిక అటు చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు అధికారికంగా ప్రకటించారు.

 

నేను చైతన్య పరస్పరాంగీకారంతో విడిపోవాలని డిసైడ్ అయ్యాము. అలాంటి సమయంలో నాతో ఉండి సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి ధన్యవాదాలు. మాకు కొంత ప్రైవసీ కావాలి నన్ను ఇంకా బాధ పెట్టకండి అంటూ సోషల్ మీడియాలో ఒక రిక్వెస్ట్ పెట్టింది. దాంతో కొంచెం సైలెంట్ అయ్యారు మీడియా వాళ్ళు. ఇక విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తను ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నట్లు కనిపించింది.

 

తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ప్రతి గ్యాంగ్ లోని అమ్మాయిలు ఇలా ఉంటారు చెప్పుకొచ్చింది. గ్యాంగ్ లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారు. ఒకరు ఎప్పుడు మంచి డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతారు అంటూ తన గురించి చెప్పింది. ఇంకొకరు ఏది వేసుకున్నా కాన్ఫిడెంట్ గా ఉంటారు. మరొకరు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. చివరికి ఒక మహాతల్లి ఉంటుంది తను ఎప్పుడు అసలు కనిపించదు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -