Niharika: భర్తకు విడాకులు ఇకపై నిహారిక అలా సెటిల్ కానున్నారా?

Niharika: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నిహారిక పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. భర్త చైతన్యతో నిహారికకు మనస్పర్ధలు వచ్చాయని ఆ కారణంగా ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ కానీ అటు చైతన్య నిహారిక కానీ స్పందించలేదు.

ఇటీవల చైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో నిహారికను అన్‌ఫాలో చేయడం మాత్రమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేశాడు. నిహారిక కూడా భర్తని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసి చైతన్యతో కలిసి దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్‌ ఇచ్చారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత నటనకు గుడ్ బాయ్ చెప్పేసిన నిహారిక నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. నిహారిక సొంతంగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే.

తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్‌ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్‌ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ ఫోటోలను చూసి నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇక్కడే ఆ రూమ్ లో అలాగే సెటిల్ అవ్వబోతోంది నిహారిక ఫ్యూచర్ కూడా ముందు ముందు ఇలానే ఉండబోతోంది అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -