Nikki Galrani: డెలివరీ డేట్ చెప్పేయండి.. వాళ్లపై నిక్కీ గల్రానీ ఫైర్!

Nikki Galrani: ఒక విచిత్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగానే కొనసాగకుండా విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు అన్నగా నటించి మెప్పించాడు. ఈ ఏడాది మే లో తాను ప్రేమించిన అమ్మాయి, నటి నిక్కీ గల్రాని ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెల్సిందే.

 

ప్రస్తుతం ఈ జంట వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిక్కీ- ఆది త్వరలోనే తల్లిదండ్రులు కానున్నారని కోలీవుడ్‌లో వరుసగా వార్తలు వస్తున్నాయి. నిక్కీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

 

ఫేక్ వార్తలు ప్రచారం చేయొద్దు..
తాజాగా ఈ వార్తలపై నిక్కీ గల్రాని ఘాటుగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టు చేసింది. ‘నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నాకే తెలీదు. కొంతమంది నేను ప్రెగ్నెంట్ అనే వార్తని వైరల్ చేశారు. వాళ్ళే కొంచెం నా డెలివరీ డేట్ కూడా చెప్పేయండి. నేను ప్రెగ్నెంట్ ని కాదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఆ వార్త ముందుగా నేనే చెప్తాను. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయకండి’ అని స్పష్టం చేసింది.

 

కాగా, ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు 2015లో వచ్చిన యాగవరైనుం నా కాక్క చిత్రంలో తొలిసారిగా కలిశారు. ఈ సినిమాను తెలుగులో మలుపుగా తీశారు. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది అది ప్రేమకు దారితీసింది. దీంతో పెద్దలను ఒప్పించి చెన్నైలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు సందీప్ కృష్ణన్, నానితో పాటు టాలీవుడ్,కోలివుడ్‌కు చెందిన పలువురు నటులు మే 19న వివాహ వేడుకలో పాల్గొన్నారు. రిసెప్షన్‌లో పలువురు కూడా పాల్గొన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -