Jr NTR: తారక్ ఈ రేంజ్ లో సక్సెస్ కావడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా?

Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆపై పలు సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నటన విషయంలో పూర్తిగా తాతకు తగ్గ మనవడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

అలా ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవల దర్శకదీరుడు రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాలో ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో బి టౌన్ ప్రేక్షకులను సైతం కదిలించాడు.

అన్ని ఎమోషన్స్ ని ఒకే పాత్రలో పండించాడు ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హడావిడి చేస్తున్నాడు. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా కూడా పలు సినిమా ఆఫర్లు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇలా ఎన్టీఆర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నారట. ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా హరికృష్ణ గారి రెండవ భార్య ఎన్టీఆర్ తల్లి షాలిని. ఆమె ఎన్టీఆర్ కు ఎంతో సపోర్టివ్ గా ఉండేదట.

నిజానికి ఎన్టీఆర్ తల్లి షాలిని సినీ ఇండస్ట్రీలో అంతగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈమె ఎన్టీఆర్ ఇప్పుడు అగ్రస్థాయిలో సక్సెస్ అవ్వడానికి కారణమైంది. ఇక ఎన్టీఆర్ రాబోయే సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ 30 అనే ప్రాజెక్టు లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ఎన్టీఆర్ 31 అనే ప్రాజెక్టు కు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -