Lakshmi Pranathi: అయ్యో దేవరే.. ఎన్టీఆర్ భార్య గురించి అంత నీచంగా కమెంట్లు చేశారా?

Lakshmi Pranathi: తెలుగు సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా మనందరికీ సుపరిచితమే. ఈమె సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. పిల్లలకు తన భర్త అలాగే ఇంటి బాధ్యతలను చూసుకుంటూ బిజీబిజీగా ఉంటుంది లక్ష్మీ ప్రణతి. కాగా ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ల పెళ్లి జరిగిన తర్వాత కొన్నేళ్ల పాటు ఎన్టీఆర్ కు అదృష్టం ఏ మాత్రం కలిసిరాలేదు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి.

ఊసరవెల్లి సినిమా నుంచి రభస సినిమా వరకు ఎన్టీఆర్ నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వాటి మ‌ధ్య‌లో ఒక్క బృందావ‌నం మాత్ర‌మే యావ‌రేజ్‌ గా నిలిచింది. అయితే ఎన్టీఆర్ భార్యపై కూడా ఆ సమయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఎన్టీఆర్ భార్య వల్ల ఆయనకు అదృష్టం కలిసిరాలేదని అదే సమయంలో కెరీర్ పరంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అంతేకాకుండా లక్ష్మీ ప్రణతి
ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు కూడా చేశారట.

 

ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో ప్రణతి కూడా ఫీలయ్యారట. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇండస్ట్రీలో జయాపజయాలు సాధారణం అని నెగిటివ్ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పారట. లక్ష్మీ ప్రణతి చాలా సెన్సిటివ్ అని నెగిటివిటీ ఆమెకు నచ్చదని ఈ రీజన్ వల్లే ఇంటర్వ్యూలలో కూడా ఆమె కనిపించరని సమాచారం. తర్వాత రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు వరుస విజయాలు లభించడంతో ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి తారక్ కు అదృష్ట దేవత అని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -