Chandrayaan 3: చంద్రయాన్3 సక్సెస్ గురించి పాక్ మీడియా విస్తృత కవరేజీ.. భారత ప్రజలు గర్వపడేలా?

Chandrayaan 3: చంద్రయాన్ 3 విషయంలో భారత్ సాధించిన ఘనవిజయం గురించి ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. ఒకప్పుడు మన శక్తిని కించపరుస్తూ కార్టూన్లు వేసిన పత్రికలు సైతం భారతదేశం శక్తిసామర్థ్యాలను మెచ్చుకుంటూ పత్రికలలో పతాక శీర్షికలో రాయడం భారతదేశం గర్వించదగిన విషయం. భారత్ ని అగ్రగామిగా నిలిపిన ప్రయోగం ఇది అంటూ ప్రపంచ ప్రఖ్యాత ద గార్డియన్ పత్రిక సైన్స్ ఎడిటర్ ఇయాన్ సాంప్లే వ్యాఖ్యానించారు. అమెరికా సహా ఇంతకుముందు ఎవరు చేయని విధంగా దక్షిణ ధ్రువం పై ల్యాండర్ ని ఇస్రో దింపింది.

భవిష్యత్తులో ఇది భారత్ని అంతరిక్ష పరిశోధనలో అగ్రగామిగా నిలుపుతుంది అంటూ రాసుకొచ్చింది ఈ పత్రిక. ఇక స్కై న్యూస్ అనే ప్రపంచ ప్రఖ్యాత పత్రిక అమెరికా, ఐరోపా, జపాన్ లో ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశోధనలను వ్యాపారంగా మార్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారత తన సాంకేతిక సామర్థ్యంతో పోటీలో ఉన్నాననే సంకేతాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇస్రో విజయాన్ని బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు సైతం కొనియాడారు. పాకిస్తాన్ మీడియా అయితే భారత్ విజయంపై విస్తృతంగా కవరేజీ ఇచ్చింది.

 

ప్రధానిని, ఇస్రోని, భారత ప్రజలని అభినందిస్తూ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ ప్రకటన విడుదల చేశారు. అలాగే సోనియా గాంధీ సైతం ఇస్రోని అభినందిస్తూ లేఖ రాశారు. శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ పెద్ద విజయం సాధించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో చైనా తరువాత చంద్రుడి పై అడుగుపెట్టిన రెండో దేశంగా భారత్ అవతరించిందని సిఎన్ఎన్ తన కథనాల్లో తెలిపింది.

 

ఈ విషయంలో తాము భాగస్వాములము కావడం గర్వకారణం అని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ అన్నారు. చంద్రుడే దక్షిణ దృవం పై భారత్ చారిత్రాత్మక లాండింగ్ చేసిందని బీబీసీ పేర్కొంది. గతంలో మంగళయాన్ మిషన్ ని ఉద్దేశించి వ్యంగ్య కార్టూన్ ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ సైతం భారత్ కి ఇది గొప్ప విజయం అంటూ కితాబు నిచ్చింది. భారతదేశానికి ఇవే మహత్తర క్షణాలు, భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తొలి దేశంగా నిలిచిపోయింది అంటూ ప్రపంచ పత్రికలన్నీ భారత్ ని అభినందనలతో ముంచెత్తుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -