Mohammed bin Salman: అమ్మకానికి పాకిస్తాన్ దేశం.. సౌదీ రాజు ఎంతకు బేరం ఆడుతున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mohammed bin Salman: మన దాయాది దేశమైన పాకిస్తాన్ మరీ అంత దీనస్థితిలో ఉందా.. ఆర్థిక సాయం కోసం దీనంగా ఎదురుచూస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి ప్రపంచ దేశాలకి తెలిసిందే కానీ మరి పాకిస్తాన్ అమ్మకానికి ఉందని..సౌదీ అరేబియా రాజు కొనుగోలుకి సిద్ధంగా ఉన్నారని తెలిసి ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి. ఈ కారణంగానే సౌదీ అరేబియా పాకిస్తాన్ కి భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో ప్రథమంగా ఉంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్ లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకోవడానికే అన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకోసమే సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించబోతున్నారు. ఇతని ఇస్లామాబాద్ లో పర్యటన చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని ఆయన సన్నిహితులు మీడియాకి చెప్పారు.

అక్కడ ఆయన పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్హత్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసీం మునీర్ లని కలుస్తారని పక్క సమాచారం. అయితే ఈ మీటింగ్ వెనక తన ఇమేజ్ ని పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశం అని మహమ్మద్ బిన్ సల్మాన్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొత్తగా ప్రభుత్వం ఎన్నిక అయ్యేవరకు మున్నీర్ ఆ బాధ్యతలని చూసుకుంటారు.

ఇస్లామాబాద్ పర్యటన ముగిసిన తరువాత సెప్టెంబర్ 10వ తేదీన ఆయన భారత్ లో కూడా పర్యటన ప్రారంభిస్తారు. కాగా పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో సౌదీ రాజు ఆ దేశాన్ని సందర్శించడం వెనక పెట్టుబడులకు సంబంధించిన మార్గాలు ఏమైనా తెరుచుకుంటాయా అనే అంచనాలు ఉండవచ్చును అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని మీద మనకి పూర్తి విషయాలు తెలియాలంటే సౌదీ అరేబియా రాజు పాకిస్తాన్ పర్యటన అయ్యేంతవరకు ఎదురుచూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -