Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాలు రాజకీయాలతో తీరికలేని సమయం గడుపుతున్నారు పవన్. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కేటీఆర్ చేసిన చాలెంజ్ ను స్వీకరించాడు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, పవన్ చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు, పోస్ట్‌ చేయాలని సచిన్‌ టెండూల్కర్‌, పవన్‌ కళ్యాణ్‌, ఆనంద్‌ మహీంద్రాలకు మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ చేశారు. దీంతో మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్ ను పవన్‌ కళ్యాణ్‌ స్వీకరించారు.

దీన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్, రామ్‌ భాయ్‌ ఛాలెంజ్‌ స్వీకరించాను. చంద్రబాబు, మంత్రి బాలినేని శ్రీనివాస్‌, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ లకు నామినేట్‌ చేస్తున్నా అంటూ ఫోటోలను షేర్‌ చేశారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆ ట్వీట్‌ కు మంత్రి కేటీఆర్‌ థ్యాంక్యూ అన్నా అని సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఇది ఇలా ఉంటే నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల అభ్యున్నతి కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ నేతన్న భీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతు బీమా లాగే నేతన్నకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడు. అయితే ఒకవేళ నేత కార్మికుడు మరణిస్తే ఆ మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందుతుందట. ఇకపోతే హీరో పవన్ కళ్యాణ్ విషయానికీ వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అలాగే భగవదీయుడు భగత్ సింగ్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటితో పాటుగా పలు ప్రాజెక్టులు కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -